అనిల్‌ దేశ్‌ముఖ్‌కు సుప్రీంలో చుక్కెదురు: సీబీఐ దర్యాప్తు అవసరమే

By narsimha lodeFirst Published Apr 8, 2021, 6:03 PM IST
Highlights

మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముంబై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అనిల్ దేశ్ ముఖ్ దాఖలు చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు గురువారం నాడు కొట్టివేసింది.


ముంబై: మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముంబై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అనిల్ దేశ్ ముఖ్ దాఖలు చేసిన పిటిషన్ ను  సుప్రీంకోర్టు గురువారం నాడు కొట్టివేసింది.

మహారాష్ట్రలో ప్రతి నెల రూ. 100 కోట్లు వసూలు చేయాలని హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్  పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సీబీఐ విచారణకు ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే  ఈ పిటిషన్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను గురువారం నాడు కొట్టివేసింది.

also read:ముంబై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకి: పిటిషన్ దాఖలు చేసిన మహారాష్ట్ర మాజీ మంత్రి

ఆరోపణల తీవ్రత, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల హోదాను బట్టి స్వతంత్ర్య సంస్థతో దర్యాప్తు అవసరమేనని ఉన్నత న్యాయస్థానం  అభిప్రాయపడింది.

ఓ సీనియర్ మంత్రిపై సీనియర్ అధికారి  తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు విచారణ జరిపితే  తప్పేంటని కోర్టు ప్రశ్నించింది. తమ పదవుల నుండి తప్పుకొనే వరకు సీనియర్ ఐపీఎస్ అధికారి పరంబీర్ సింగ్, అనిల్ దేశ్ ముఖ్ కలిసి పనిచేసినవారే కదా  అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

click me!