
తిరువనంతపురం: లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కోడా పటేల్ ను రీకాల్ చేయాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా సోమవారం నాడు తీర్మానం చేసింది. కేరళ సీఎం పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లక్ష్యద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (2021) ద్వీపంలో నిరసనలకు కారణమైంది.
లక్ష్యద్వీప్ ప్రజలు ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారన్నారు. స్థానిక నిరసనలను విస్మరించారన్నారు. నియంతృత్వ చర్యల తర్వాత సంస్కృతి సంప్రదాయం ముప్పు పొంచి ఉందని ఈ తీర్మాణంలో పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధికి కూడ ముప్పు ఉందని ఈ సందర్భంగా విజయన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంతో ద్వీపం యొక్క దీర్ఘకాల సంబంధాలను ఎత్తి చూపింది. సంఘ్ పరివార్ ఈ ద్వీపాన్ని మరో ప్రయోగశాలగా మార్చాలని చూస్తోందని దీనిని దేశ ప్రజలు అనుమతించరని విజయన్ చెప్పారు.ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆ తీర్మానంలో విజయన్ డిమాండ్ చేశారు.
అరేబియా సముద్రంలో లక్షద్వీప్ నిర్వాహకుడు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్, సీపీఎం ఎంపీలు రాష్ట్రపతికి లేఖ రాశారు. కేరళకు చెందిన ఎంపీల బృందాన్ని సందర్శించడానికి అనుమతి లభించలేదు. కరోనా ప్రోటోకాల్ కు విరుద్దంగా ఎంపీల బృందానికి అనుమతి నిరాకరించారు. కొత్త రూల్స్ ను బీజేపీ సమర్ధించింది. స్వార్థ ప్రయోజనాలు ఉన్నవారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ మండిపడింది. మాల్దీవులు ప్రధాన పర్యాటక కేంద్రంగా ద్వీపాన్ని అభివృద్ది చేయడానికి ఈ కొత్త రూల్స్ దోహదం చేస్తాయని బీజేపీ తెలిపింది.