చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేం, చేయబోం.. ప్రధానికి మమతా ఘాటు లేఖ..!

By AN TeluguFirst Published May 31, 2021, 11:39 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ అలపాన్ బందోపాధ్యాయను వెంటనే కేంద్రానికి రిపోర్ట్ చేయమంటూ ఇచ్చిన ఉత్తర్వుల మీద మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇది ఏకపక్ష ఉత్తర్వు అని దీంతో తాను షాకు గురయ్యానని, ఆశ్చర్యపోయానంటూ విరుచుకుపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె ఓ లేఖ రాశారు. 

పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ అలపాన్ బందోపాధ్యాయను వెంటనే కేంద్రానికి రిపోర్ట్ చేయమంటూ ఇచ్చిన ఉత్తర్వుల మీద మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇది ఏకపక్ష ఉత్తర్వు అని దీంతో తాను షాకు గురయ్యానని, ఆశ్చర్యపోయానంటూ విరుచుకుపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె ఓ లేఖ రాశారు. 

రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బెంగాల్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేదని, చేయబోదని తేల్చి చెప్పారు. అంతేకాదు ఇదివరకే తాము చట్టాలకు లోబడి సీఎస్పదవీకాలం పొడగింపుకు కోరాం. దానికి అనుగుణంగా పొడిగింపును ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో రిలీజ్ చేయమనడం సరికాదు అంటూ సుదీర్ఘ లేఖలో తెలిపారు. 

కేంద్రం ఉత్తర్వుల ప్రకారం బందోపాధ్యాయ సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కాగా ముఖ్యమంత్రి తన లేఖలో సీఎస్ ఇక్కడే ఉంటారని రాష్ట్రంలోని కోవిడ్ సంక్షోభ పరిస్థితులపై పనులు కొనసాగిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.

శుక్రవారం ప్రధాని మోడీతో ముఖ్యమంత్రుల సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకాకపోవడంతో కేంద్ర కార్యదర్శిని కేంద్రానికి తరలించాలని ఆదేశించారు.

మమతా బెనర్జీ ప్రధాని మోడీతో యాస్ సమీక్ష సమావేశాన్ని స్కిప్ చేసిన కొన్ని గంటలకే చీఫ్ సెక్రటరీ రీకాల్ ఆర్డర్ వచ్చింది. బెంగాల్ లోని కలైకుండ్ ఎయిర్ బేస్ లో కాసేపు ఆయనతో కలిసి మాట్లాడారు.

రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితుల దృష్ష్యా బంధోపాధ్యాయ పదవీకాలం మూడు నెలలు పెంచుతూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను ఆమె ఊటంకించారు. అంతేకాదు ఇప్పటికిప్పుడు అతన్ని కేంద్రానికి పిలవడం అనే.. ఈ ఉత్తర్వు "చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కానిదన్నారు. చారిత్రాత్మకంగా అపూర్వమైనది, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం" అని మమతా బెనర్జీ అన్నారు.

"కలైకుండాలో మా సమావేశానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా," అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని.. ఇలాంటి తప్పుడు ప్రాధాన్యతలతో ప్రజా ప్రయోజనాలను బలి తీసుకోవడం సరికాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

click me!