కరోనా ఎఫెక్ట్: బీహార్‌లో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు

By narsimha lodeFirst Published May 31, 2021, 3:14 PM IST
Highlights

లాక్‌డౌన్ ను ఈ ఏడాది జూన్ 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కరోనా కేసుల వ్యాప్తి  నిరోధించేందుకు నితీష్ సర్కార్ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది.  
 


పాట్నా: లాక్‌డౌన్ ను ఈ ఏడాది జూన్ 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కరోనా కేసుల వ్యాప్తి  నిరోధించేందుకు నితీష్ సర్కార్ మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది. క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సమావేశమైంది.   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి త్రిపురారి షరన్  అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ నెల 5వ తేదీన బీహార్ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు లాక్‌డౌన్ ను కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.  ఈ నెల 26 నుండి  ఈ నెల 25వ తేదీ వరకు  లాక్‌డౌన్ ను పొడిగించింది. ఈ నెల 26 నుండి జూన్ 1వ తేదీ వరకు లాక్‌డౌన్ ను పొడిగించింది. రేపటితో లాక్‌డౌన్ ముగియనుంది.  దీంతో ఇవాళ సమావేశం నిర్వహించిన ఉన్నతాధికారుల బృందం లాక్‌డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకొంది. 

కరోనాను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా బీహార్ సర్కార్ ప్రకటించింది. అయితే వ్యాపారులకు మాత్రం కొన్ని అదనంగా సడలింపులు ఇచ్చినట్టుగా తెలిపింది.బీహార్‌లో రోజువారీ కరోనా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 1500 కంటే తక్కువగా నమోదౌతున్నాయి. 


 

click me!