ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. అసెంబ్లీ బయట తనను కించపరిచేలా మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతానని ఆయన హెచ్చరించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా సీఎం పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోరును అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకపోతే క్రిమినల్ కేసులు పెడుతానని హెచ్చరించారు. గవర్నర్ పురోహిత్ ‘హిందుస్థాన్ టైమ్స్’తో మాట్లాడుతూ.. జూన్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం భగవంత్ మాన్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిస్తూనే.. మరో సారి తన ఇమేజ్ పై దాడి చేస్తే క్రిమినల్ కేసు పెడతానని అన్నారు.
దొంగతనం చేశారనే అనుమానంతో బలవంతంగా మూత్రం తాగించి, మలద్వారంలో మిరపకాయలు రుద్ది.. వీడియో వైరల్
“అసెంబ్లీలో మన్ నా పరువుకు నష్టం కలిగించేలా ప్రసంగించడం మీరు (మీడియా ప్రతినిధిని ఉద్దేశించి) చదివారు. అతడు నాపై ‘లెటర్ లిఖ్తా రెహ్తా హై’ (ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు) అని, అలాగే ‘వెహ్లా’ (పనిలేకుండా) అని కించపరిచే పదజాలాన్ని ఉపయోగించారు. ” అని గవర్నర్ పురోహిత్ ‘హిందుస్థాన్ టైమ్స్’తో చెప్పారు.
‘‘సీఎంకు సభలో కొన్ని చట్టపరమైన రక్షణలు ఉంటాయి. బయట నాపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే, అతడిపై క్రిమినల్ ఫిర్యాదు చేయమని నేను నా ఆఫీసుకు చెబుతాను. అతడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 (ఏదైనా చట్టబద్ధమైన అధికారాన్ని ఉపయోగించమని బలవంతం చేయడం లేదా నిరోధించే ఉద్దేశ్యంతో రాష్ట్రపతి లేదా గవర్నర్ ప్రతిష్ఠకు భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేస్తాను’’ అని అన్నారు.
హర్యానాలో మత ఘర్షణలు.. నుహ్ లో రాళ్లు విసిరేందుకు అవకాశం ఇచ్చిన హోటల్ కూల్చివేత..
గవర్నర్ పై అతిగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించడం కూడా ఆయనను (మాన్) క్రిమినల్ చర్యలకు బాధ్యులను చేస్తుందని పురోహిత్ అన్నారు. గవర్నర్ ను ఎవరూ కించపరచలేరని చెప్పారు. గవర్నర్ కు చాలా అధికారాలు ఉంటాయని తెలిపారు.
ఇదిలా వుండగా.. రెండు యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లకు ఏడాది పాటు పదవీ కాలం పొడిగించాలని ప్రభుత్వం చేసిన సిఫార్సును పురోహిత్ అంగీకరించలేదు. యూజీసీ నిబంధనల ప్రకారం ఇద్దరు వీసీలకు చెరో ఆరు నెలల పొడిగింపునకు మాత్రమే అనుమతించారు. వీసీలను నిర్ణీత కాలానికి నియమించారని, వారి పదవీకాలం ముగియక ముందే ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని గవర్నర్ ప్రభుత్వానికి పంపిన లేఖలో పేర్కొన్నారు.
అర్థరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మరణం.. మరో ముగ్గురికి గాయాలు
కాగా.. అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ వీసీ జస్పాల్ సింగ్ సంధు, పాటియాలాలోని జగత్ గురునానక్ దేవ్ పంజాబ్ స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ కరంజీత్ సింగ్ లను పదవి కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని పంజాబ్ ఆప్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సిఫార్సులను గవర్నర్ కు పంపించింది.