Presidential Election: విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి టీఆర్ఎస్ మద్దతు ఉందన్న శరద్ పవార్

Published : Jun 21, 2022, 04:41 PM ISTUpdated : Jun 23, 2022, 05:53 PM IST
Presidential Election: విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి టీఆర్ఎస్ మద్దతు ఉందన్న శరద్ పవార్

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ మద్దతు ఎవరికనే దానిపై కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఉందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ మద్దతు ఎవరికనే దానిపై కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించే సందర్భంగా యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్‌ మద్దతుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఉందని శరద్ పవార్ ప్రకటించారు. కేసీఆర్‌తో తాను ఫోన్‌లో మాట్లాడనని శరద్ పవార్ చెప్పారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి  అభ్యర్థి కోసం ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానం అందింది. అయితే ఉమ్మడి అభ్యర్థి ఎంపిక సమావేశాలకు మాత్రం టీఆర్ఎస్ దూరంగా ఉంది. కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే తాము ఈ సమావేశాలకు దూరంగా ఉన్నామని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 

Also Read: Presidential Election: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. అధికారిక ప్రకటన

అయితే తాజాగా ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి  అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించారు. అయితే ఇందుకు కేసీఆర్ మద్దతు ఉందని శరద్ పవార్ చెప్పారు. అయితే.. ఈ విషయంలో టీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే.. ఆ పార్టీ స్టాండ్ తెలిసే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం