
ముంబయి: మహారాష్ట్ర హైడ్రామా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ లీడర్ ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు గుజరాత్‌లో క్యాంప్ వేసిన సంగతి తెలిసిందే. సూరత్‌లోని ఓ హోటల్‌లో దిగిన ఈ 22 మంది ఎమ్మెల్యేల్లో నితిన్ దేశ్‌ముఖ్ కూడా ఉన్నాడు. అయితే, నితిన్ దేశ్‌ముఖ్ కనిపించకపోవడంతో ఆయన భార్య ఆందోళనకు గురైంది. సోమవారం 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు తన భర్త చివరిసారిగా తనతో ఫోన్‌లో మాట్లాడాడని, అప్పటి నుంచి ఆయన గురించిన వివరాలేమీ లేవని తెలిపింది.
ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ బాలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఏక్‌నాథ్ షిండేతోపాటు గుజరాత్‌కు వెళ్లినట్టు సమాచారం. గుజరాత్‌లోని ఓ హోటల్‌లో వారంతా బస చేస్తున్నారని, కానీ, వారిని బయటి నుంచి ఎవరూ కలువకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ తరుణంలో మరో వార్త వెలుగులోకి వచ్చింది.
ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ భార్య ప్రాంజలి ఈ విషయమై ఆందోళన చెందినట్టు తెలిసింది. తన భర్త క్రితం రోజు రాత్రి నుంచి కనిపించకపోవడంతో ఆమె తన భర్తకు ప్రాణ హాని ఉన్నదని పోలీసులను ఆశ్రయించింది. 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఆయనతో ఫోన్‌లో మాట్లాడానని, ఆ తర్వాతి నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నదని ఆమె పేర్కొంది. తన భర్తకు ప్రాణ హాని ఉన్నదేమోనని ఆమె వణికిపోయింది. దీంతో ఆమె స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త కనిపించడం లేదని రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చింది.
కాగా, సూరత్ వెళ్లిన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ అనారోగ్యం బారిన పడ్డట్టు తెలిసింది. దీంతో ఆయనను ఓ హాస్పిటల్‌కు తరలించినట్టు సమాచారం.