కథువా: విరాళంగా వచ్చిన సొమ్ము స్వాహా

By narsimha lodeFirst Published Apr 12, 2019, 6:07 PM IST
Highlights

కథువాలో మైనర్ బాలిక కుటుంబానికి వచ్చిన సహాయాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  డ్రా చేశారని బాదిత కుటుంబం ఆరోపిస్తోంది  బాధిత కుటుంబానికి వచ్చిన సహాయాన్ని కూడ స్వాహా చేశారు.

న్యూఢిల్లీ: కథువాలో మైనర్ బాలిక కుటుంబానికి వచ్చిన సహాయాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  డ్రా చేశారని బాదిత కుటుంబం ఆరోపిస్తోంది  బాధిత కుటుంబానికి వచ్చిన సహాయాన్ని కూడ స్వాహా చేశారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథువాలో మైనర్ బాలికను అపహరించి రేప్ చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ఆ సమయంలో దేశ వ్యాప్తంగా నిరసనలు  వెల్లువెత్తాయి. బాధిత కుటుంబానికి దేశ వ్యాప్తంగా విరాళాలను సేకరించి బాధిత కుటుంబానికి అందించారు. 

బాధిత కుటుంబానికి బ్యాంకులో రూ. 22 లక్షలు ఉన్నాయి. అయితే ఈ  రూ. 22 లక్షల్లో  బాధితుడికి తెలియకుండానే  రూ. 10 లక్షలను డ్రా చేశారు. తనకు తెలియకుండానే రూ. 10 లక్షలను డ్రా చేశారని బాధితురాలి తండ్రి చెప్పారు. చెక్‌ల ద్వారా ఈ బ్యాంకు ఖాతా నుండి డబ్బులను డ్రా చేశారని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

అయితే బ్యాంకు నుండి ఇద్దరు డబ్బులు డ్రా చేశారని అధికారులు చెప్పారు.అస్లాం ఖాన్, నజీమ్‌ పేర్ల మీద బ్యాంకు నుండి  డబ్బులను డ్రా చేసినట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. బ్యాంకు ఖాతా వివరాలు పూర్తిగా తెలిసిన వారే  డబ్బులను డ్రా చేసి ఉంటారని బ్యాంకు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

click me!