బాండ్ల రూపంలో పార్టీలకు విరాళాలు: వివరాలకు సుప్రీం ఆదేశం

By narsimha lodeFirst Published Apr 12, 2019, 3:54 PM IST
Highlights

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈ ఏడాది మే 30వ తేదీ లోపుగా అన్ని రాజకీయ పార్టీలు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈ ఏడాది మే 30వ తేదీ లోపుగా అన్ని రాజకీయ పార్టీలు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాల సేకరణ విషయంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై  సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎవరెవరు ఎంత మొత్తాన్ని పార్టీలకు విరాళంగా ఇచ్చారో వివరాలు అందించాలని  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అసోసియేషన్ ఆప్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఎడీఆర్) అనే స్వచ్ఛంధ సంస్థ సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ‌ను రద్దు చేయాలని  కోరుతూ ఆ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్టీలకు విరాళాలు తీసుకొే వెసులుబాటును కల్పించింది.

click me!