లక్షిత దాడులను నివారించడానికి కాశ్మీరీ పండిట్ లకు శిక్షణ, ఆయుధాలు ఇవ్వాలి - జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ వైద్

By team teluguFirst Published Oct 19, 2022, 2:30 PM IST
Highlights

లక్షిత దాడులను అడ్డుకోవాలంటే కాశ్మీర్ పండిట్లకు ఆత్మ రక్షణ శిక్షణ, చిన్నపాటి ఆయుధాలు ఇవ్వాలని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ అభిప్రాయపడ్డారు. తీవ్రవాద ముప్పు ఉన్న రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. 

కాశ్మీర్ పండిట్లపై దాడులను నివారించాలంటే వారికి శిక్షణ, ఆయుధాలు ఇవ్వాలని జమ్మూ జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ అన్నారు. దశాబ్దాలుగా పండిట్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లో అత్యున్నత స్థాయిలో మిశ్రమ, సమగ్ర భద్రతా ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని వైద్ మంగళవారం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. 

వరుడి కోసం దిమ్మదిరిగే కండీషన్లు.. ఐఐటీల్లో చదువు.. రూ. 2 లక్షలకుపైగా జీతం: మ్యాట్రిమోనియల్ యాడ్ వైరల్

ఇటీవల పండిట్ల పై జరుగుతున్న వరుసదాడుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదు నెలల కాలంలో ముగ్గురు పండిట్లు దారుణ హత్యకు గురయ్యారు. ఇందులో ఇద్దరు స్థానికులు కాగా.. మరొకరు వలస వెళ్లి వచ్చిన వ్యక్తి. ఆయన పీఎం ప్యాకేజీ కింద ప్రభుత్వ ఉద్యోగిగా కూడా ఉన్నారు. వీరంతా తీవ్రవాద దాడుల్లో హత్యకు గురయ్యారు. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని చౌదరి గుండ్ ప్రాంతంలోని కాశ్మీరీ పండిట్ రైతు పురాణ్ క్రిషన్ భట్‌ను అతని నివాసానికి సమీపంలో ఉగ్రవాదులు శనివారం కాల్చి చంపారు. 

ఈ నేపథ్యంలో వైద్ ఓ వార్త పత్రికతో కూడా మాట్లాడారు. పండింట్లకు వారి నివాసం వద్ద, ప్రయాణ సమయంలో, ఆఫీసుల్లో రక్షణ ఉండాలని ఆయన అన్నారు. వారి (కాశ్మీరీ పండిట్ల) భద్రతను మరింత ప్రభావవంతంగా చేయడానికి, వారికి అవసరమైన ఆయుధాలతో కూడిన ఆత్మరక్షణ శిక్షణను అందించాలని చెప్పారు. ‘‘తమను తాము రక్షించుకోవడానికి వారికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా ఇవ్వాలి’’అని తెలిపారు.

ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు:మల్లికార్జున ఖర్గే గెలుపు

మిలిటెంట్లపై దాడి జరిగితే ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు వీలుగా పిస్టల్స్ వంటి చిన్న ఆయుధాలు కలిగి ఉండాలని కూడా ఆయన అన్నారు. ఈ ప్లాన్ పని చేస్తుందా అని మీడియా ప్రశ్నించినప్పుడు ఇది కచ్చితంగా పని చేస్తుందని, దానిని ప్రయత్నించడంలో ఎలాంటి హానీ లేదని అన్నారు. “ సరైన శిక్షణ తీసుకున్న తరువాత పోలీసుల మాదిరిగానే వారు (కాశ్మీరీ పండిట్లు) కూడా తీవ్రవాదుల దాడిని తిప్పికొట్టగలరు. పోరాడగలరు. తీవ్రవాదులపై ఎదురు కాల్పులు జరపగలరు” అని అన్నారు. 

‘‘ కుంటి బాతులుగా కాకుండా తీవ్రవాదులు దాడి చేసినప్పుడల్లా తిప్పికొట్టడం మంచిది ’’ అని ఆయన అన్నారు. మిలిటెంట్ల ఆయుధ దొంగతనంపై వైద్ మాట్లాడుతూ.. ఆయుధం దొంగతనానికి గురి కావడానికి అవకాశం ఉంది. అయితే వారికి సరైన శిక్షణ ఇవ్వడం వల్ల దానిని తొలగించవచ్చు ’’ అని ఆయన తెలిపారు. 

రాజకీయ కార్యకర్తలు, ఎన్నికైన పంచాయతీ సభ్యులతో పాటు మిలిటెంట్ దాడులకు గురయ్యే మెజారిటీ వర్గానికి చెందిన వ్యక్తులకు కూడా ఆయుధ శిక్షణ, ఆత్మరక్షణ కోసం చిన్న ఆయుధాలు అందించవచ్చని వైద్ అభిప్రాయపడ్డారు. పీఎం ప్యాకేజీ కింద రిక్రూట్ అయ్యి లోయలోని మారుమూల ప్రాంతాల్లో నియామం అయిన పండిట్ ఉద్యోగులకు మరింత ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. అందుకే వారి సేవలను లోయలోని సురక్షితమైన కార్యాలయాల నుంచి ఉపయోగించుకోవాలి లేకపోతే వారి విధులను తాత్కాలికంగా జమ్మూకి మార్చాలని సూచించారు.

వామ్మో.. కాన్పూర్ యూనివర్సిటీలో మేక‌ను మింగేసిన కొండచిలువ.. వైర‌ల్ వీడియో ! 

కాగా.. ఈ ఏడాది మే 12న మిలిటెంట్లు కాశ్మీరీ పండిట్ ఉద్యోగిని హత్య చేసిన తర్వాత దాదాపు 5500 పీఎం ప్యాకేజీ ఉద్యోగులు గత ఐదు నెలలుగా లోయలోని తమ కార్యాలయాలకు వెల్లడం లేదు. భద్రత దృష్ట్యా తమను జమ్మూకి తరలించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు.

click me!