ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు:మల్లికార్జున ఖర్గే గెలుపు

By narsimha lodeFirst Published Oct 19, 2022, 1:55 PM IST
Highlights

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున  ఖర్గే గెలుపొందారు.  ఇవాళ నిర్వహించిన  కౌంటింగ్ లో శశి థరూర్  కంటే మల్లికార్జున ఖర్గేకే ఎక్కవ ఓట్లు రావడంతో  ఖర్గే విజయం సాధించినట్టుగా కాంగ్రెస్  పార్టీ ఎన్నికల రిటర్నింగ్  అధికారులు  ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు .ఖర్గేకు 7,897 ఓట్లు పోలయ్యాయి. శశిథరూర్ కు 1,072ఓట్లు మాత్రమే దక్కాయి .దీంతో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే  పగ్గాలు చేపట్టనున్నారు. ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో  416 ఓట్లు చెల్లలేదు.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున  ఖర్గే గెలుపొందారు.  ఇవాళ నిర్వహించిన  కౌంటింగ్ లో శశి థరూర్  కంటే మల్లికార్జున ఖర్గేకే ఎక్కవ ఓట్లు రావడంతో  ఖర్గే విజయం సాధించినట్టుగా కాంగ్రెస్  పార్టీ ఎన్నికల రిటర్నింగ్  అధికారులు  ప్రకటించారు.ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించినట్టుగా కాంగ్రెస్ సీఈసీ చైర్మెన్ మధసూధన్ మిస్త్రీ బుధవారంనాడు ప్రకటించారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా శశి థరూర్ ప్రకటించారు.ట్విట్టర్  వేదికగా ఈ అంశాన్ని థరూర్  ప్రకటించారు .అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా  బాధ్యతలు  చేపట్టనున్న  మల్లికార్జున ఖర్గేకి శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓట్ల  లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎన్నికల్లో  రిగ్గింగ్  జరిగిందని శశిథరూర్ ఆరోపించారు.  ఈ విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారి మిస్త్రీకి లేఖ రాశారు. ఈ లేఖ రాసిన కొద్దిసేపటికే ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల పలితాలు వెల్లడయ్యాయి.

ఖర్గే విజయం  సాధించినట్టుగా  ప్రకటిచడంతో  ఎఐసీసీ ప్రధాన కార్యాలయం వెలుపల పార్టీ శ్రేణులు  సంబరాలు జరుపుకున్నారు.24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన నేత ఎఐసీసీ అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ నెల 17న ఎఐసీసీ అధ్యక్షకు సంబంధించి  పోలింగ్ నిర్వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలనుండి బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తీసుకు వచ్చి ఇవాళ  ఎఐసీసీ  ప్రధాన కార్యాలయంలో లెక్కించారు.

2019  లోక్  సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో అధ్యక్ష  పదవికి రాహుల్  గాంధీ  రాజీనామా  చేశారు. కాంగ్రెస్  పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని పార్టీ  సీనియర్లు  సూచించారు. కానీ  ఆయన మాత్రం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించారు.  దీంతో సోనియాగాంధీ  పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.1998 నుండి  కాంగ్రెస్  పార్టీ  చీఫ్  సోనియాగాంధీ  కొనసాగుతున్నారు.2017 నుండి2019 వరకు ఈ పదవికి  ఆమె దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి  ఆరు దఫాలు ఎన్నికలు జరిగాయి. అయితే  ఈ  దఫా మాత్రం  గాంధీ  కుటుంబం నుండి  ఏ ఒక్కరూ పోటీ  చేయలేదు. అనారోగ్యం కారణంగా  సోనియాగాంధీ  పోటికి దూరంగా ఉన్నారు. రాహుల్ , ప్రియాంక  గాంధీలు కూడా  పోటీకి సుముఖతను వ్యక్తం చేయలేదు.  ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీకొ మద్దతుగా  పలు  రాష్ట్రాల  పీసీసీలు తీర్మానాలు కూడా చేశాయి. అయితే  రాహుల్  గాంధీ మాత్రం పోటీకి దూరంగా  ఉన్నారు.

also read :ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు:ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే  పోటీలో  ఉండడంతో ఖర్గే విజయం  నల్లేరుపై  నడకేనని పార్టీ  వర్గాల్లో  ప్రచారంలో ఉంది.శశి థరూర్ పోటీ  చేసినా ఆయన  కేవలం వెయ్యి ఓట్లను మాత్రమే  దక్కించుకున్నారు.

click me!