చివరి కోరిక తీరకుండానే కరుణానిధి మృతి

First Published Aug 7, 2018, 9:50 PM IST
Highlights

చివరి కోరిక తీరకుండానే తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతి చెందారు. చివరివరకు తమిళ ప్రజలకు సేవ చేయాలనేదే తన కోరిక అంటూ కరుణానిధి ఎప్పుడూ కోరుకొనేవారు.


చెన్నై: చివరి కోరిక తీరకుండానే తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతి చెందారు. చివరివరకు తమిళ ప్రజలకు సేవ చేయాలనేదే తన కోరిక అంటూ కరుణానిధి ఎప్పుడూ కోరుకొనేవారు. వందేళ్లకు పైగా తమిళ ప్రజల సేవలోనే  తరలించాలని కరుణానిధి చెప్పేవారు.  94 ఏళ్ల వయస్సులో కరుణానిధి తుదిశ్వాస విడిచారు.

50 ఏళ్లకు పైగా డీఎంకె చీఫ్‌గా కరుణానిధి కొనసాగారు.  పార్టీ అధ్యక్షుడిగా ఆయన అరుదైన రికార్డును నెలకొల్పారు. మంగళవారం నాడు  సాయంత్రం ఆరున్నర గంటలకు  మృతి చెందారు. 

వందేళ్లకు పైగా తమిళ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం తనకు ఉందని కరుణానిధి  తరచూ చెప్పేవారు. దశాబ్దాలుగా తనను గుండెల్లో పెట్టుకున్న తమిళ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని చెప్పేవారు. కరుణానిధికి ఉన్న ఆత్మస్థయిర్యం ఆసామాన్యమని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేవారు. 

కరుణానిధికి ఉన్న ఆత్మస్థయిర్యం ఆసామాన్యమని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేవారు. కావేరీ ఆసుపత్రిలో కరుణానిధి పది రోజుల క్రితం అస్వస్థతతో చేరినప్పటికీ క్రమంగా కోలుకోవడం మొదలుపెట్టడంతో ఆయన 'ఉక్కుసంకల్పమే' గెలిచిందంటూ అభిమానులు ఆనందపడ్డారు. నిండునూరేళ్లూ తమిళ ప్రజలకు సేవ చేయాలనే కరుణానిధి కోరిక నెరవేరడం తథ్యమని కూడా అంతా అనుకున్నారు.  వందేళ్లు జీవించాలనే కోరిక తీరకపోయినా వందేళ్లపాటు జ్ఞాపకాలను ఆయన మిగిల్చారు. 

click me!