ఆస్పత్రిగా మారనున్న కరుణానిధి గోపాలపురం ఇల్లు

First Published Aug 8, 2018, 3:34 PM IST
Highlights

సంపన్నులు నివసించే గోపాలపురం ప్రాంతంలోని తన నివాసాన్ని డిఎంకె అధినేత కరుణానిధి ఆస్పత్రి పెట్టడానికి విరాళంగా ఇచ్చారు. పేదల కోసం ఆస్పత్రి నడిపేందుకు ఆయన 2010లో తన నివాసాన్ని దానం చేశారు. 

చెన్నై:  సంపన్నులు నివసించే గోపాలపురం ప్రాంతంలోని తన నివాసాన్ని డిఎంకె అధినేత కరుణానిధి ఆస్పత్రి పెట్టడానికి విరాళంగా ఇచ్చారు. పేదల కోసం ఆస్పత్రి నడిపేందుకు ఆయన 2010లో తన నివాసాన్ని దానం చేశారు. 

తన 86వ జన్మదినం సందర్భంగా దాన్ని అన్నా అంజగమ్ ట్రస్టుకు ఇస్తూ గిఫ్ట్ డీడ్ పై సంతకం చేశారు. ఆ ట్రస్టు ఆయన తల్లి పేరు మీద నడుస్తోంది. తాను, తన సతీమణి మరణానంతరం ఆ ట్రస్టుకు ఇల్లు చెందేలా రాశారు. 

ఆస్పత్రికి కలైంజర్ కరుణానిధి ఆస్పత్రి అనే పేరు పెట్టాలని కూడా చెప్పారు. ఆయన 1968లో ఇంటిన తన కుమారులు అళగిరి, స్టాలిన్, తమిళరసుల పేర్ల మీద రిజిష్టర్ చేశారు. 2009లో తన కుమారుల అంగీకారం తీసుకుని దాన్ని ట్రస్టుకు దానం చేశారు. 

ట్రస్టులో మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా, ప్రముఖ సినీ గేయరచయిత వైరముత్తు సభ్యులుగా ఉన్నారు. 1955 నుంచి కరుణానిధి ఆ ఇంటిలో నివాసం ఉంటున్నారు. 

click me!