మహిళా అధికారిణి ప్రతిమ దారుణ హత్య.. ఇంట్లోనే కత్తితో దాడి..

By Sumanth Kanukula  |  First Published Nov 5, 2023, 3:57 PM IST

కర్ణాటక ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిణి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశారు. బెం


కర్ణాటక ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిణి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశారు. బెంగళూరులోని ఆమె నివాసంలోనే ఈ ఘటన జరిగింది. అయితే దారుణం జరిగిన సమయంలో మహిళా అధికారిణి భర్త, కొడుకు ఇంట్లో లేరు. వివరాలు.. బాధిత మహిళా అధికారిణి ప్రతిమ కర్నాటకలోని మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రతిమ గత కొన్నేళ్లుగా బెంగళూరులోని సుబ్రమణ్యపూరలోని దొడ్కళ్లసంద్రలోని గోకుల్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. 

శనివారం ప్రతిమ పని ముగిసిన తర్వాత ఆమెను డ్రైవర్ ఇంటి వద్ద దింపారు. ఆదివారం తెల్లవారుజామున ప్రతిమ సోదరుడు ఆమె ఇంటికి వచ్చి చూడగా ఆమె శవమై కనిపించింది. అయితే ముందు రోజు రాత్రి ఆమెకు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి సమాధానం లేకుండా పోయిందని.. అందుకే తెల్లవారుజామునే ఇంటికి వచ్చానని ఆమె సోదరుడు చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రతిమ భర్త, కొడుకు తీర్థహళ్లిలో ఉన్నారు. ఇక, గత రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ప్రతిమ హత్యకు గురైనట్లు సమాచారం.

Latest Videos

‘‘ప్రతిమ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగివచ్చింది. రాత్రి నుంచి ఆమె ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు. దీంతో ఆమె అన్నయ్య ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె హత్యకు గురై కనిపించింది. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు’’ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఫోరెన్సిక్, సాంకేతిక బృందాలను కూడా ఘటన స్థలానికి  పిలిపించారు.దర్యాప్తు కోసం మూడు బృందాలు ఏర్పాటు చేశారు. 

అయితే గత రాత్రి ఏం జరిగిందనేది తెలుసుకునేందు ప్రయత్నిస్తున్నామని.. ఏదైనా సమాచారం తెలిస్తే మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


 

click me!