ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలు: భారత్‌లోని మూడు నగరాలకు చోటు

By narsimha lode  |  First Published Nov 5, 2023, 12:00 PM IST

మానవుడు తన అవసరాల కోసం  ప్రకృతిని  నాశనం చేస్తున్నాడు.  తమ లగ్జరీ అవసరాలకు ప్రకృతిని నాశనం చేసి  అనారోగ్యాన్ని కోరి  తెచ్చుకుంటున్నాడు. కాలుష్యాన్ని తగ్గించేందుకు  చర్యలు తీసుకోకపోతే ఆ ప్రభావం భవిష్యత్తు తరాలు మరిన్ని ఇబ్బందులకు గరయ్యే అవకాశాలు లేకపోలేదు.



న్యూఢిల్లీ:దేశ రాజధాని న్యూఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.   విషపూరితమైన  పొగమంచుతో న్యూఢిల్లీ కప్పబడింది. దీంతో  స్కూళ్లకు కూడ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రపంచంలో  అత్యంత కాలుష్య నగరాల్లో  ఇవాళ  భారత్ కు చెందిన మూడు నగరాలకు చోటు దక్కింది. 

స్విస్  గ్రూప్ ఐక్యూఎయిర్ డేటా ప్రకారంగా దేశంలోని  కోల్ కత్తా, ముంబై , న్యూఢిల్లీ కూడ  ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో  ఒకటిగా నిలిచింది.గత కొన్ని రోజులుగా  న్యూఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది.  ఇవాళ  న్యూఢిల్లీలో  గాలి నాణ్యత  483కి చేరింది. కోల్‌కత్తా, ముంబై నగరాల్లో కూడ  వాయు కాలుష్యం భారీగా పెరిగింది. 

Latest Videos

ప్రపంచంలో గాలి నాణ్యత దెబ్బతిన్న నగరాల్లో  ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచీ మేరకు  ఢిల్లీలో గాలి నాణ్యత  483 గా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో పాకిస్తాన్ లోని  కరాచీ నిలిచింది. లాహోర్ లో గాలి నాణ్యత 371గా నమోదైంది.మూడో స్థానంలో  భారత్ లోని కోల్ కత్తా నగరం నిలిచింది.  కోల్ కత్తా నగరం లో గాలి నాణ్యత  206 గా నమోదైంది.  బంగ్లాదేశ్ లో గాలి నాణ్యత  189గా  రికార్డైంది.  పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో  గాలి నాణ్యత  162 గా రికార్డైంది. మరో వైపు ఇండియాలోని ముంబైలో గాలి నాణ్యత  162 గా నమోదైంది. చైనాలోని షియాంగ్ పట్టణంలో  గాలి నాణ్యత 159గా రికార్డైంది. ఆ తర్వాతి స్థానంలో చైనాలోని  హంగ్జూ పట్టణానికి చోటు దక్కింది. ఈ పట్టణంలో కూడ గాలి నాణ్యత  159గా రికార్డైంది.కువైట్ లో గాలి నాణ్యత 155గా నమోదైంది. పదో స్థానంలో  చైనాలోని వుహాన్ పట్టణాకి చోటు దక్కింది.  ఈ పట్టణంలో గాలి నాణ్యత  152గా నమోదైంది.

తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, గాలి లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లో వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో  గాలి నాణ్యత తగ్గిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గాలి నాణ్యత తగ్గిన కారణంగా  న్యూఢిల్లీలోని  20 మిలియన్ల జనాభాలో  పలువురు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  కళ్ల సమస్యలు,గొంతు దురద వంటి ఆరోగ్య సమస్యలతో  ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

గాలి నాణ్యత   0 నుండి  50 మధ్య ప్రజలకు ఇబ్బంది కల్గించదు. అయితే  400-500 మధ్య ఎక్యూఐ సూచిస్తే  ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.గాలి నాణ్యత పడిపోయిన కారణంగా  ఆసుపత్రికి వచ్చిన పిల్లల్లో ఎక్కువ మంది శ్వాస సంబంధమైన వ్యాధులతో పాటు దగ్గుతో బాధపడుతున్నారని  ఢిల్లీకి చెందిన  ఓ డాక్టర్  సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

పీఎం 2.5 అని పిలవబడే  సూక్ష్మకణాల సాంద్రత  523 ఎంజీ ప్రతి క్యూబిక్ మీటరుకు ఉంటే ఇబ్బంది లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు చెబుతున్నాయి.  అయితే 104.6 కంటే ఉంటే  ప్రజల ఊపిరితిత్తులపై  ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

న్యూఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో  భవన నిర్మాణ పనులను నిలిపివేశారు.  ప్రజా రవాణాను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. మరో వైపు  వర్క్ ఫ్రమ్ హోమ్  ను ప్రోత్సహిస్తుంది ఢిల్లీ సర్కార్.

భారత్ లో  ప్రపంచకప్  క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో  వాయి కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా  న్యూఢిల్లీ, ముంబైలలో  బాణసంచా కాల్చడాన్ని  నిషేధించిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్ , శ్రీలంక మధ్య  సోమవారం మ్యాచ్ ను ఢిల్లీలో నిర్వహించాల్సి ఉంది.  పొగమంచు కారణంగా  శుక్రవారంనాడు రెండు జట్ల ప్రాక్టీస్ రద్దైంది.

click me!