ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూల్స్‌కు సెలవులు..

By Sumanth Kanukula  |  First Published Nov 5, 2023, 12:29 PM IST

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది.



దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఈరోజు ఉదయం కూడా ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10 వరకు మూసివేయాలని ఆదేశించింది. అదే సమయంలో దృష్ట్యా 6 నుంచి 12 తరగతులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించే అవకాశం కల్పించామని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దేశ రాజధానిలో గాలి నాణ్యత అధ్వాన్న స్థాయికి పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకన్నట్టుగా చెప్పారు. 

అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 5 వరకు మూసివేయాలని ఆదేశించింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గకపోవడంతో ప్రాథమిక పాఠశాలను నవంబర్ 10 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

Latest Videos

undefined

ఇదిలాఉంటే, ఢిల్లీలోని గాలి నాణ్యత శుక్రవారం ‘‘తీవ్రమైన’’ కేటగిరీకి పడిపోయింది. అప్పటి నుంచి పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. ఆదివారం ఉదయం 7 గంటలకు జాతీయ రాజధాని మొత్తం గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 460గా నమోదైంది. తద్వారా ఢిల్లీలో గాలి నాణ్యత ఇప్పటికీ ‘‘తీవ్రమైన’’ విభాగంలో మిగిలిపోయింది.  ఇక, ఢిల్లీ సగటు ఏక్యూఐ శనివారం 415 వద్ద స్థిరపడింది.

ఇక, న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మెకానికల్ రోడ్ స్వీపర్లు రెండు షిఫ్టులలో తడి స్వీపింగ్ కోసం యాంటీ స్మోగ్ గన్ లేదా మిస్ట్ స్ప్రేయర్‌ని ఉపయోగించడం, 18,000 వాటర్ ట్యాంకర్లు లేదా ట్రాలీలను ఢిల్లీలోని ప్రధాన రహదారుల వెంబడి చెట్లు, పొదలపై నీటిని చిలకరించే విధంగా అందుబాటులో ఉంచింది. 

ఇక, పంజాబ్, హర్యానాలో పంట కోత అనంతరం పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత గత వారం రోజులుగా క్షీణించింది. ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని ద‌ృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇక, ప్రజలు ప్రైవేట్ వాహనాలకు బదులు ప్రజారవాణాను ఉపయోగించాలని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. 

click me!