
ఓ మహిళ తన కట్టుకున్న భర్త ను ప్రియుడు, స్నేహితులతో కలిసి అతి దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకి చెందిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతను కనిపించకుండా పోయిన మరుసటి రోజు.. కనకపూర అడవి సమీపంలో అతను శవమై కనిపించడం గమనార్హం. అతని హత్య కేసులో పోలీసులు అతని భార్య, ఆమె ప్రియుడు, మరో ముగ్గురు స్నేహితులను అరెస్టు చేశారు.
నగరానికి చెందిన కిరణ్ గౌడ.. మరల్వాడీ గ్రామంలో చికెన్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. కిరణ్ గౌడకు పెళ్లైంది. అయితే... అతని భార్య చైత్ర... మరో వ్యక్తిని ప్రేమించింది. అతనితో గడపడానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన ఆమె.. భర్తను చంపేయాలని ప్లాన్ వేసింది. అందుకోసం ప్రియుడితోపాటు.. మరో ముగ్గురి సహాయం తీసుకోవడం గమనార్హం.
కిరణ్ రోజు దుకాణానికి వెళ్లి... రాత్రి 8గంటల 45 నిమిషాలకు దుకాణం మూసివేసి ఇంటికి వచ్చేవాడు. కానీ... శుక్రవారం మాత్రం అతను తిరిగి ఇంటికి రాలేదు. కాగా... శనివారం ఉదయం కిరణ్ కనిపించడం లేదంటూ... అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిరణ్ భార్య చైత్ర పై అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ యాంగిల్ లో పోలీసులు దర్యాప్తు చేయగా అసలు నేరస్తులు బయటపడ్డారు.
పార్టీ పేరు చెప్పి దూరంగా తీసుకువెళ్లి.. దారుణంగా చంపినట్లు తేలింది. అతని మెడకు తాడు బిగించి.. ఉరివేసి మరీ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.