భార్య కాళ్లకు నెయిల్ పాలిష్ వేసిన భర్త... నెటిజన్ల రియాక్షన్ ఇదే..!

Published : Nov 01, 2022, 10:46 AM IST
భార్య కాళ్లకు నెయిల్ పాలిష్ వేసిన భర్త... నెటిజన్ల రియాక్షన్ ఇదే..!

సారాంశం

ఓ వ్యక్తి రైలులో తన భార్య కాళ్లకు నెయిల్ పాలిష్ వేశాడు. వారిని చూస్తుంటే కొత్తగా పెళ్లైన వారిలో అయితే లేరు.

పెళ్లైన కొత్తలో దంపతుల మధ్య ఉన్న ప్రేమ... పెళ్లైన కొంత కాలం తర్వాత ఎక్కువగా ఉండదుు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పురుషులు.. పెళ్లి అంటే.. అదో పెద్ద శిక్ష అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ... పెళ్లై చాలా కాలం గడిచిన తర్వాత కూడా.. భార్యభర్తలు ప్రేమగా మెలగవచ్చని ఓ జంట నిరూపించింది. ఓ వ్యక్తి రైలులో తన భార్య కాళ్లకు నెయిల్ పాలిష్ వేశాడు. వారిని చూస్తుంటే కొత్తగా పెళ్లైన వారిలో అయితే లేరు. అయినా.. ప్రేమగా ఆమె పాదాలను పట్టుకొని నెయిల్ పాలిష్ వేయడం విశేషం.దీంతో... ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

దిలీప్ సోలంకి అనే ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని షేర్ చేయగా.. వైరల్ గా మారింది. ఈ వీడియోకి దాదాపు 8లక్షల వ్యూస్ రావడం గమనార్హం.

 


వీడియోలో దంపతులు... రైల్లో ఎదురెదురు బెర్త్ లపై కూర్చొని ఉన్నారు.  సదరు మహిళ.. తన భర్త బెర్త్ పై కాళ్లను పెట్టగా.. ఆమె భర్త.. ఆమెకు నెయిల్ పాలిష్ వేయడం విశేషం. నెటిజన్ల రియాక్షన్ ఈ వీడియోకి అదిరిపోతోంది. భార్య అంటే ఎంత ప్రేమ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu