భారీగా ఆదాయం వచ్చే ఆలయాల నుంచి 10 శాతాన్ని సేకరించే వివాదాస్పద బిల్లును కర్ణాటక శాసన మండలి తిరస్కరించింది. బీజేపీ, జేడీ (ఎస్) సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. (Karnataka Hindu Religious Institutions and Charitable Endowments (Amendment) Bill- 2024) అయితే గత బుధవారం ఈ బిల్లును శాసన సభ ఆమోదించింది. మళ్లీ ఈ బిల్లును మండలిలో ప్రవేశపెట్ట అవకాశం ఉంది.
దేవాలయాల ఆదాయంలో 10 శాతాన్ని సేకరించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఓ చట్టం తీసుకురావాలని కూడా నిర్ణయించింది. అందులో భాగంగా కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (సవరణ) బిల్లు-2024ను తీసుకొచ్చింది. ఈ వివాదాస్పద బిల్లు శాసన సభలో ఆమోదం పొందింది. కానీ దానిని శాసన మండలి శుక్రవారం తిరస్కరించింది.
ఎమ్మెల్యే లాస్యను వెంటాడిన ప్రాణ భయం.. ఒంటిపై 12 తాయత్తులు..
ఈ బిల్లును శాసన మండలిలో ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టింది. బీజేపీ, జేడీఎస్ సభ్యులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మండలి డిప్యూటీ చైర్మన్ ఎంకే ప్రాణేష్ వాయిస్ ఓటింగ్ కు పిలుపునిచ్చారు. అయితే ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు తిరస్కరణకు గురైంది. మొత్తంగా ఈ బిల్లుకు అనుకూలంగా ఏడుగురు సభ్యులు, వ్యతిరేకంగా 18 మంది సభ్యులు ఓటు వేశారు.
మండలిలో బిల్లును ప్రవేశపెట్టిన రవాణా, ముజరాయి మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేవాలయాల నుంచి ప్రభుత్వానికి రూ.8 కోట్లు వస్తున్నాయన్నారు. కొత్త నిబంధన అమల్లోకి వస్తే ప్రభుత్వానికి రూ.60 కోట్ల ఆదాయం వస్తుందని, ఈ నిధులతో 'సి' గ్రేడ్ దేవాలయాల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34,165 'సి' గ్రేడ్ దేవాలయాల్లో 40 వేల మందికి పైగా అర్చకులు ఉన్నారని ఆయన తెలిపారు. అర్చకులకు ఇళ్లు నిర్మించి, పిల్లలకు ఉపకార వేతనాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని అన్నారు.
వ్యభిచార దందా నడుపుతున్న బీజేపీ నేత అరెస్ట్..
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మండలిలో ప్రతిపక్ష నేత కోటా శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ.. దేవాలయాల ఆదాయంలో 10 శాతం వసూలు చేయడం సరికాదన్నారు. రూ.100 కోట్లు వసూలు చేస్తే బిల్లు ప్రకారం రూ.10 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాలని అన్నారు. కానీ మొదట ఖర్చులను తీసేయాలని, ఆ తరువాత తన వాటాను తీసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలోని 'సి' గ్రేడ్ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేయాలని తెలిపారు.
సింహాలకు సీత, అక్బర్ పేర్లు.. ఒకే ఎన్ క్లోజర్ లో ఉంచడంపై హైకోర్టు ఫైర్..
కాగా.. ఈ బిల్లు తిరస్కరణకు గురైన తర్వాత బీజేపీ సభ్యులు సభలో జై శ్రీరామ్ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు భారత్ మాతాకీ జై, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం కర్ణాటక శాసనసభ ఈ వివాదాస్పద బిల్లును ఆమోదించింది. సోమవారం శాసన మండలిలో మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.