
పాట్నా : కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన ‘Hijab’ వ్యవహారంపై బీహార్ ముఖ్యమంత్రి Nitish Kumar స్పందించారు. ప్రజల మతపరమైన మనోభావాల్ని తమ రాష్ట్రంలో గౌరవిస్తామని, Biharలో అసలు ఇదొక సమస్యే కాదన్నారు. తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ను ధరిస్తే దానిపై అసలు కామెంట్ చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. బీహార్లో ఇదొక issue కాదన్న ఆయన... తాము ఇలాంటివి పట్టించుకోబోమన్నారు. ఇదంతా పనికిరాని వ్యవహారమని వ్యాఖ్యానించారు.
పాట్నాలో Prajadarbar సందర్భంగా విలేకరులతో మాట్లాడిన నితీష్ ‘బీహార్ పాఠశాలల్లో పిల్లలంతా దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. ఎవరైనా తలపై ఏదైనా పెట్టుకుంటే దానిపై మాట్లాడాల్సిన అవసరం లేదు అలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. ఒకరి మతపరమైన సెంటిమెంట్లను గౌరవిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సమానమే’ అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోని ఉడిపిలో హిజాబ్ ధరించిన విద్యార్థుల్ని కళాశాలల్లోకి అనుమతి నిరాకరించడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, పది రోజులుగా hijab, కేసరి వివాదంతో పలు జిల్లాల్లో బుధవారం నుంచి మూతపడిన schoolలు సోమవారం ప్రారంభం అయ్యాయి. గొడవలు తలెత్తకుండా ప్రభుత్వం భారీ బందోబస్తును కల్పిస్తోంది. ముందు జాగ్రత్తగా బెంగళూరు, మైసూరు, ఉడుపిలతో పాటు పలు జిల్లాల్లో భద్రతను పెంచాలని నిర్ణయించింది. సీఎం
Basavaraj Bommai జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
తొలి విడతలో 1 నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు మొదలయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో section 144 జారీ చేశారు. 12 నుంచి 19వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలవుతాయి. బడుల వద్ద గుంపులుగా ఉండరాదని, ధర్నాలు చేయరాదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. హిజబ్ లు, కేసరి కండువాలను వేసుకుని వస్తే అధికారులు ఎలా వ్యవహరిస్తారో.. కాగా పాఠశాల పరిస్థితిని గమనించిన తర్వాత collegeలో ఆరంభంపై నిర్ణయానికి వస్తామని సీఎం చెప్పారు.
కాగా, కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మొదలైన ఈ వివాదం ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాల వరకూ చేరిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకు పాఠశాలల్లో మతాన్ని వ్యక్తీకరించే దుస్తులు వేసుకురావద్దని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేస్తూ ఈ రోజు పాఠశాలలకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను స్టాఫ్ అడ్డుకుంది. స్కూల్ గేటు బయటే వారిని నిలిపేసింది. హిజాబ్ తొలగించిన వారినే పాఠశాలలకు అనుమతించిన ఘటనకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
మాండ్య జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల గేటు బయట కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారు. వారిని స్కూల్‌లోనికి అనుమతించడానికి స్టాఫ్ ససేమిరా అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు హిజాబ్ తొలగించే పాఠశాలలకు రావాలని ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ విషయమై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. వేడి వేడిగా వారి మధ్య వాగ్వాదాలు జరిగాయి. తమ పిల్లలను హిజాబ్ ధరించే స్కూల్‌లోకి అనుమతించాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. కనీసం తరగతి గది వరకైనా తమ పిల్లలను హిజాబ్ ధరించే వెళ్లడానికి అనుమతించాలని, క్లాసు రూమ్‌లో వారు తమ హిజాబ్ తొలగిస్తారని చెప్పారు. అయినప్పటికీ ఆ ఉపాధ్యాయులు వారిని అనుమతించలేదు. స్కూల్ బయటే హిజాబ్ తొలగించాలని స్పష్టం చేశారు.