40 ఏళ్ల వ్య‌వ‌ధిలో 14 మందిని పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఏమైందంటే ?

Published : Feb 15, 2022, 04:21 AM IST
40 ఏళ్ల వ్య‌వ‌ధిలో 14 మందిని పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఏమైందంటే ?

సారాంశం

ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా 14 మందిని పెళ్లి చేసుకున్నాడు వ్యక్తి. అతడి భాగోతం మొత్తం చివరి భార్యకు తెలిసింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం నిందితుడుని అరెస్ట్ చేశారు. 

40 ఏళ్ల వ్యవధిలో ఏడు రాష్ట్రాల్లోని 14 మంది మహిళలను పెళ్లి చేసుకున్న వ్య‌క్తిని సోమవారం భువనేశ్వర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రిని వివాహ‌మాడి వారిని మోసం చేశాడు. చివ‌రి భార్య‌కు ఈ విష‌యం తెలియ‌డంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో అత‌డు బాగోతం మొత్తం వెలుగులోకి వ‌చ్చింది. 

భువనేశ్వర్ (Bhubaneswar) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ దాష్ (eputy Commissioner of Police Umashankar Dash) తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిందితుడు ఒడిశా (Odisha)లోని కేంద్రపరా జిల్లాలోని పట్కురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్య‌క్తి. అత‌డు మొద‌టిసారిగా 1982లో ఓ మ‌హిళ‌ను పెళ్లి చేసుకున్నాడు. అనంత‌రం 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండు పెళ్లిళ్ల వ‌ల్ల అత‌డు ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. 2002 నుంచి 2020 మధ్య దాదాపు 12 పెళ్లిలు చేసుకున్నాడు. పెళ్లిల కోసం అత‌డు మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ల‌ను ఉపయోగించుకున్నాడు. ముందుగా మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ల ద్వారా మ‌హిళ‌ల‌తో స్నేహం చేసి, ఒకరికి తెలియ‌కుండా ఒక‌రిని వివాహం చేసుకున్నాడు. 

నిందితుడు త‌న‌ను తాను డాక్టర్‌గా ప‌రిచ‌యం చేసుకొని చాలా మందిని వివాహం చేసుకున్నాడు. ఇతడు పెళ్లి చేసుకున్న వారిలో లాయ‌ర్లు, డాక్ట‌ర్లు, ఉన్నత విద్యావంతులైన మహిళలు కూడా ఉండటం గ‌మ‌నార్హం. అత‌డి బాధితుల్లో ఓ పారా మిలటరీ దళంలో పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు. మొత్తంగా ఢిల్లీ, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాల్లోని మహిళలను అత‌డు మోసం చేశాడు. అతని మొదటి ఇద్దరు భార్యలు ఒడిశాకు చెందిన వారు.

అత‌డు చివ‌రిగా ఢిల్లీ (delhi)లో స్కూల్ టీచ‌ర్ గా ప‌ని చేసే మ‌హిళ‌ల‌ను పెళ్లి చేసుకున్నాడు. గ‌తంలో అత‌డికి జ‌రిగిన వివాహాల విష‌యం మ‌హిళ‌ల‌కు తెలియడంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో అత‌డిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మధ్య వయస్సుల్లో ఉన్న‌, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మ‌హిళ‌ల‌ను వ‌దిలిపెట్టే ముందు వారి నుంచి డ‌బ్బులు తీసుకున్నాడని పోలీసులు చెప్పారు. అయితే ఈ విష‌యాన్ని నిందితుడు ఖండించాడు. అత‌డి వ‌ద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఎర్నాకులంలో నిరుద్యోగ యువకులను మోసం చేయడం, రుణం ఇస్తాన‌ని మోసం చేయ‌డం వంటి నేరాలకు పాల్ప‌డినందుకు గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu