మా పార్టీకి స్థానాలు తగ్గినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది..: కర్ణాటక ఎర్లీ ట్రెండ్స్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్

Published : May 13, 2023, 10:29 AM IST
మా పార్టీకి స్థానాలు తగ్గినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది..: కర్ణాటక ఎర్లీ ట్రెండ్స్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలక ఫలితాలు వెలువడుతున్న వేళ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఛరీష్మా పనిచేస్తుందని కర్ణాటక ఎన్నికల కూడా మరోసారి రుజువు చేశాయని అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలక ఫలితాలు వెలువడుతున్న వేళ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఛరీష్మా పనిచేస్తుందని కర్ణాటక ఎన్నికల కూడా మరోసారి రుజువు చేశాయని అన్నారు. బీజేపీ తక్కువ స్థానాల్లో లీడింగ్‌లో ఉందని ప్రశ్నించగా.. అధికారంలో ఉన్న పార్టీగా మళ్లీ అధికారం చేజిక్కుంచుకోవడం కష్టతరమని జీవీఎల్ చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కారణంగా కర్ణాటకలో బీజేపీ మంచి ప్రదర్శన కనబరిచిందని.. స్థానికంగా ఇంకా మంచి ఫర్‌ఫామెన్స్ చేసి ఉండాల్సిందన్నారు. ఇందుకు సంబంధించి పార్టీలో విశ్లేషణ జరుగుతుందని చెప్పారు. కర్ణాటకలో తమ పార్టీకి స్థానాలు తగ్గినట్టుగా  స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విశ్లేషణ చేయడం జరుగుతుందని చెప్పారు. 

ఇదిలా ఉంటే..  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థులు 70కి పైగా స్థానాల్లో ముందజలో కొనసాగుతున్నారు. జేడీఎస్ అభ్యర్థులు 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని  కాంగ్రెస్ కార్యాలయాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కూడా సందడి వాతావరణం నెలకొంది. 

Also Read: కర్ణాటక ఫలితాలు.. ఎమ్మెల్యేలుగా గెలిచే నాయకులు బెంగళూరుకు రావాలని కాంగ్రెస్ ఆదేశం..!!

Also Read: ఆ విషయం అధిష్టానం నిర్ణయిస్తుంది.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మా నాన్న సీఎం కావాలి: యతీంద్ర సిద్దరామయ్య

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!