అధికార పార్టీకి సెకండ్ ఛాన్స్ ఇవ్వని వైనం.. కన్నడిగుల విలక్షణ తీర్పు, బీజేపీ 1985 సీన్ రిపీట్ చేస్తుందా..?

Siva Kodati |  
Published : May 10, 2023, 07:44 PM IST
అధికార పార్టీకి సెకండ్ ఛాన్స్ ఇవ్వని వైనం.. కన్నడిగుల విలక్షణ తీర్పు, బీజేపీ 1985 సీన్ రిపీట్ చేస్తుందా..?

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దీంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం.. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగినట్టుగా తెలుస్తోంది. 

దేశమొత్తం ఆసక్తిగా గమనిస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరికి పలకరించబోతోంది అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. మరోసారి బీజేపీకి అవకాశం దక్కుతుందా లేక.. కాంగ్రెస్‌ను ఓటరు కరుణిస్తారా, ఇదేమీ కాకుండా హంగ్ వస్తుందా అని రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచినట్లుగా వారు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే కర్ణాటక రాజకీయ చరిత్రను ఇదే సమయంలో ఓసారి గుర్తుచేసుకుంటే.

1985 తర్వాత కన్నడిగులు ఏ పార్టీకి వరుసగా రెండో సారి అధికారాన్ని ఇవ్వలేదు. వరుసగా ఏడు ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయాయి. సమర్ధవంతంగా పాలించి , ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వాలను కూడా ఓటర్లు తిరస్కరించారు. 1990ల నుంచి పోటీలో నిలుస్తున్న మూడు ముఖ్యమైన పార్టీలకు (కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్) ఈ విషయం తెలియదు. అలాగే ఈ మధ్య మధ్యలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుండా విలక్షణమైన తీర్పును ఇచ్చారు కన్నడిగులు.

ALso Read: Karnataka Elections 2023: ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎగ్జిట్ పోల్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

1983, 85లలో జనతాదళ్ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 89లో కాంగ్రెస్, 94లో జేడఎస్, 1999లో కాంగ్రెస్, 2004లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి, 2008లో బీజేపీ, 2013లో కాంగ్రెస్, 2018లో తొలుత కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అధికారంలోకి రాగా.. అనంతరం ఇరు పార్టీల్లో సంక్షోభం కారణంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. 

ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న మూడు పార్టీలకు భౌగోళికంగా ఓట్ల పంపిణీలో వైరుధ్యాలు వున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ఆదరాభిమానులు సమానంగా వున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. ప్రధానంగా ఉత్తర, మధ్య కర్ణాటకల్లో ఆ పార్టీ ప్రభావం చూపుతోంది. లింగాయత్ సామాజిక వర్గం ఈ పార్టీకి అండగా నిలబడటంతో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదిగి పలుమార్లు అధికారాన్ని అందుకుంది.

ఇక ఉప ప్రాంతీయ పార్టీగా వున్న జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్)కు దక్షిణాది జిల్లాల్లో (పాత మైసూరు)లో బలం వుంది. ఇక్కడ వొక్కలిగా సామాజిక వర్గం ఆధిపత్యం వుండగా.. వీరంతా జేడీఎస్‌కే జై కొడుతున్నారు. ఫలితంగా కాంగ్రెస్ ఎక్కువ ఓట్లను ఆకర్షించినప్పటికీ... ఇతర పార్టీలను అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కంటే 7 శాతం అధికంగా ఓట్లు పొందింది. కానీ హస్తం కంటే కమలం 14 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. 

Also Read: Exit Polls: కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ? లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్!: 3 ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్రాన్ ఖురేషీ అంచనా ప్రకారం.. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు వున్నాయి. ఇక్కడ మేజిక్ ఫిగర్ 113. కానీ ప్రభుత్వం సురక్షితంగా వుండటానికి కనీసం 120 మంది సభ్యుల బలం అవసరం. ఆయన అంచనా ప్రకారం తాజా ఎన్నికల్లో బీజేపీకి 60 నుంచి 80.. కాంగ్రెస్‌కు 80 నుంచి 90, జేడీఎస్‌కు 25 సీట్లు లభిస్తాయట. కాంగ్రెస్ పలుమార్లు 120 పైచీలుకు ఓట్లు గెలుచుకోగా.. బీజేపీ ఎప్పుడు మెజారిటీని సాధించలేదు.

2008లో 110, 2018లో 104 సీట్లనే ఆ పార్టీ గెలుచుకుంది. అయితే అధికారాన్ని అందుకోవడానికి బీజేపీ రెండు సార్లు (2008, 2019)లలో కాంగ్రెస్, జేడీఎస్‌లలో ఫిరాయింపులను ప్రోత్సహించింది. అయితే ప్రస్తుతం వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్‌ కర్ణాటకలో మరోసారి హంగ్ ఏర్పడుతుందని చెబుతున్నాయి. మరి బీజేపీ 1985 సీన్ రిపీట్ చేయగలదా లేదా కాంగ్రెస్‌ అధికారాన్ని అందుకుంటుందో లేదో తెలియాలంటే మే 13 వరకు వెయిట్ చేయాల్సిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్