Karnataka Election 2023: కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు : ఓటువేసిన‌ నిర్మలా సీతారామన్

By Mahesh RajamoniFirst Published May 10, 2023, 2:15 PM IST
Highlights

Karnataka Election 2023: సీనియర్ సిటిజన్లు, యువత, మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిల్చుంటున్నారని, వారు తనతో మాట్లాడిన తీరు చూస్తుంటే క‌ర్నాట‌క‌లో బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుందని స్పష్టమవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
 

Karnataka Assembly Election 2023: బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీఏ పాల‌న‌తో ద్రవ్యోల్బణం పెరిగిన తీరును ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ కు ద్ర‌వ్యోల్బ‌ణంపై ప్రభుత్వాన్ని విమర్శించే హక్క లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

దేశంలో ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతున్న తీరుపై ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈ క్ర‌మంలోనే పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. తాను, బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ధరలు తగ్గాలని కోరుకుంటున్నామని కూడా పేర్కొన్నారు. ధరల పెరుగుదలను నియంత్రించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనీ, తమ హయాంలో ద్రవ్యోల్బణం నిరంతరం ఎక్కువగా ఉంటున్న‌ద‌ని ఈ అంశంపై కేంద్రాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ కు లేదని ఆమె అన్నారు.

అలాగే, క‌ర్నాట‌క‌లో మ‌ళ్లీ బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు అవుతుంద‌ని కేంద్ర మంత్రి ధీమా వ్య‌క్తం చేశారు. సీనియర్ సిటిజన్లు, యువత, మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిల్చుంటున్నారని, వారు నాతో మాట్లాడిన తీరు చూస్తుంటే బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుందని స్పష్టమవుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్లు, యువత, మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిల్చుంటున్నారని, వారు నాతో మాట్లాడిన తీరు చూస్తుంటే క‌ర్నాట‌క‌లో బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుందని స్పష్టమవుతోందని అన్నారు.

అలాగే, విశ్వహిందూ పరిషత్ యువజన విభాగం భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం మూర్ఖత్వానికి నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భ‌జరంగ్ బలిని ఎప్పుడూ గౌరవిస్తామనీ, హనుమాన్ చాలీసా చదువుతామని చెప్పారు. కానీ "కాంగ్రెస్ కు మాత్రం ఇది ఎన్నికల అంశమే. హనుమంతుడి జన్మస్థలం కర్ణాటక. దాన్ని మేనిఫెస్టోలో రాశారు. బేవకూఫీ కి ఉదాహరన్..." అని నిర్మలా సీతారామన్ అన్నారు. 
 

click me!