karnataka Election 2023 : ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే - హోరాహోరీలో బీజేపీకి ఎడ్జ్..!

Published : Apr 21, 2023, 08:35 PM ISTUpdated : Apr 21, 2023, 08:54 PM IST
karnataka Election 2023 : ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే - హోరాహోరీలో బీజేపీకి ఎడ్జ్..!

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుంది. కర్ణాటకలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. అయితే ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ నిర్వహించిన మెగా ఆన్‌లైన్ సర్వేలో ఆసక్తికరమైన పరిశీలనలు వెల్లడయ్యాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుంది. కర్ణాటకలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఆయా రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2024 లోక్‌సభ ఎన్నికలపై కొంతైన ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీ మధ్య పోరు చాలా మంది రాజకీయ పండితులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

కన్నడ, ఇంగ్లీషు మాట్లాడే డిజిటల్ రీడర్లలో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ నిర్వహించిన మెగా ఆన్‌లైన్ సర్వేలో ఆసక్తికరమైన పరిశీలనలు వెల్లడయ్యాయి. కర్ణాటకలో హోరాహోరీ పోరు జరిగినప్పటికీ.. కొంత బీజేపీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉన్నాయని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఇక, ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వేలో 3.5 మిలియన్ల మంది యూజర్లు పాల్గొన్నారు. వీరిలో 52 శాతం మంది కర్ణాటకకు చెందిన వారు. సర్వే ఫలితాలను పరిశీలిస్తే.. 

బెటర్ బెట్
ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే - పీపుల్స్ ఛాయిస్.. కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై 42 శాతం మంది ఇంగ్లీష్ రెస్పాండెంట్స్ ఏదో ఒక రూపంలో అసంతృప్తిగా ఉన్నారు. అయితే 44 శాతం మంది మాత్రం రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడానికి  డబుల్ ఇంజిన్ సర్కార్‌(బీజేపీ) దోహదపడిందని విశ్వసించారు.  

కన్నడ రెస్పాండెంట్స్ విషయానికొస్తే.. సర్వేలో పాల్గొన్న వారిలో 35 శాతం మంది రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఏదో ఒక రూపంలో అసంతృప్తిగా ఉన్నారు. అయితే అత్యధికంగా 52 శాతం మంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేసిందని అంగీకరించారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించని పక్షంలో 44 శాతం మంది కన్నడ రెస్పాండెంట్స్.. బీజేపీ-జేడీఎస్ (జనతాదళ్-సెక్యులర్) మధ్య సంకీర్ణ ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. కన్నడ రెస్పాండెంట్స్‌లో కేవలం 20 శాతం మంది మాత్రమే కాంగ్రెస్-జేడీఎస్ కలయికతో నడిచే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు.

అయితే ఈ విషయంలో ఇంగ్లీష్ రెస్పాండెంట్స్ వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. 41 శాతం మంది కాంగ్రెస్-జేడీఎస్ కూటమి రాష్ట్రానికి మంచిదని అంటుంటే..  బీజేపీ-జేడీఎస్ కూటమి వైపు 37 శాతం మొగ్గు చూపారు. అయితే ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే కర్ణాటక ఓటర్లను ప్రత్యేకంగా లక్ష్యంగా చేయలేని విధంగా అశాస్త్రీయంగా ఉందని గమనించాలి. వాస్తవానికి ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది కర్ణాటకకు చెందిన వారు కాదు. అదే సమయంలో ఎక్కువ మంది ఓటర్లు కూడా కాదు.

మోదీనా?.. రాహులా?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చాలా స్వారీ  చేయాల్సి ఉంది. కర్ణాటక రాష్ట్రానికే చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇది ఆయనకు అగ్ని పరీక్ష. ఒక విజయం పార్టీలో అతని స్థానాన్ని పదిలపరుస్తుంది. కానీ ఓడిపోతే పార్టీలో మరో అసమ్మతి చెలరేగవచ్చు. పార్టీని నడిపించే అతని సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు.

అయితే రాహుల్ గాంధీ కొన్ని నెలల కిందట చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా సాధ్యమయ్యే మద్దతుపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే ఏషియానెట్ డిజిటల్ సర్వే ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి ఏది ఏమైనా.. ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే కొంతమందికి కోపం తెప్పించే విధంగా కూడా ఉండొచ్చు. 

కన్నడ (69 శాతం), ఇంగ్లీషు (50 శాతం) రెండింటిలోనూ  అధిక సంఖ్యలో రెస్పాండెంట్స్ రాహుల్ గాంధీ ఫ్యాక్టర్ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయవానికి సహాయం చేయదని అభిప్రాయపడ్డారు. మరోవైపు కన్నడ రెస్పాండెంట్స్ 58 శాతం, ఇంగ్లిష్‌ రెస్పాండెంట్స్ 48 శాతం మంది నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఓటును స్వింగ్ చేసే సమస్యలు..
రిజర్వేషన్:
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ కర్ణాటకలోని అణగారిన వర్గాలకు ఏదో ఒక విధంగా సహాయపడుతుందని 75 శాతం కన్నడ రెస్పాండెంట్స్, 58 శాతం ఇంగ్లిష్ రెస్పాండెంట్స్ అంగీకరిస్తున్నారని ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే అంచనా వేసింది. ఈ కొత్త రిజర్వేషన్ విధానం అణగారిన వర్గాలకు సహాయం చేయదని కన్నడ రెస్పాండెంట్స్ 21 శాతం, మరియు ఇంగ్లిష్ రెస్పాండెంట్స్ 22 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి, 4 శాతం ముస్లిం కోటాను తొలగించి.. లింగాయత్‌లు, వొక్కలిగాలకు సమానంగా పంపిణీ చేయడంలో కర్ణాటక ప్రభుత్వం ఇటీవలి రిజర్వేషన్ల విధానానికి 62 శాతం మంది కన్నడ రెస్పాండెంట్స్, 48 శాతం ఇంగ్లిష్ రెస్పాండెంట్స్ మద్దతుగా నిలిచారు.

అవినీతి: దేశంలోని ప్రతి ప్రాంతంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ అవినీతి అనేది ఒక సమస్య. క‌ర్ణాట‌క‌లో కూడా క‌థ వేరేగా లేదు. కన్నడ రెస్పాండెంట్స్ 46 శాతం, ఇంగ్లిష్ రెస్పాండెంట్స్ 48 శాతం మంది ఏ రాష్ట్ర ప్రభుత్వ పదవీకాలం అత్యంత అవినీతిమయమైందో ఎన్నుకునే విషయానికి వస్తే.. అన్ని ప్రభుత్వాలు ఈ ముప్పును ఎదుర్కోవడంలో విఫలమైనందున అందరూ సమాన దోషులేనని పేర్కొన్నారు. 

అయితే 19 శాతం మంది కన్నడ రెస్పాండెంట్స్ మునుపటి యడియూరప్ప పరిపాలన (17 శాతం ఓట్లు), అంతకు ముందు ఉన్న హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వం (18 శాతం ఓట్లు) కంటే ప్రస్తుత బొమ్మై ప్రభుత్వం అవినీతిమయమని చెప్పారు. 

ఇంగ్లిష్ రెస్పాండెంట్స్ అయితే పూర్తిగా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ మూడింటిలో బొమ్మై ప్రభుత్వం అతి తక్కువ అవినీతికి పాల్పడిందని వారు చెప్పారు. 19 శాతం మంది ఇంగ్లిష్ రెస్పాండెంట్స్  కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ ప్రభుత్వం అవినీతిమయం అని, 16 శాతం మంది యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిమయని, 17 శాతం మంది బొమ్మై పాలన అవినీతిమయమని పేర్కొన్నారు.

అభివృద్ధి: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మునిగిపోకుండా నిరోధించడంలో అభివృద్ధి అనేది పాత్ర పోషించనుంది. ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే ప్రకారం.. కన్నడలో 66 శాతం మంది రెస్పాండెంట్స్, 57 శాతం ఇంగ్లిష్ రెస్పాండెంట్స్ రాష్ట్రంలో ప్రస్తుత బీజేపీ హయాంలో మంచి లేదా ఒక విధమైన పారిశ్రామిక అభివృద్ధిని సాధించారని అభిప్రాయపడ్డారు. కేవలం 14 శాతం మంది కన్నడ రెస్పాండెంట్స్,  25 శాతం మంది ఇంగ్లిష్ రెస్పాండెంట్స్ దీనికి విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తం  చేశారు.

రైతులు: గణనీయమైన సంఖ్యలో కన్నడ రెస్పాండెంట్స్ (45 శాతం) బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతు అనుకూలమైనదిగా ఆమోదించారు. ఇంగ్లిష్ రెస్పాండెంట్స్ విషయానికి వస్తే.. కేవలం 39 శాతం మంది మాత్రమే బొమ్మై నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రైతుల అనుకూలమైనదని చెప్పారు. 

ఏషియానెట్ న్యూస్ డిజిటల్ సర్వే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక-రాజకీయ డైనమిక్స్‌పై పదునైన అంతర్దృష్టిని ఇచ్చింది. మే 13న ప్రజల తీర్పు ఏమిటనేది తేలనుంది. 
 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu