మద్రాస్-ఐఐటీలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. ఈ ఏడాదిలో 4వ ఘ‌ట‌న

Published : Apr 21, 2023, 07:46 PM IST
మద్రాస్-ఐఐటీలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. ఈ ఏడాదిలో 4వ ఘ‌ట‌న

సారాంశం

IIT Madras student suicide: ఐఐటీ మద్రాస్ హాస్టల్ గదిలో ఉరేసుకుని మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఒక్క‌ ఏడాదిలోనే ఇది నాలుగో ఘ‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థి శుక్రవారం చెన్నైలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని హాస్టల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  

IIT Madras student found hanging in hostel room: చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-మ‌ద్రాస్) హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇండియా టూడే  నివేదించింది. వివ‌రాల్లోకెళ్తే.. ఐఐటీ మద్రాస్ హాస్టల్ గదిలో ఉరేసుకుని మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఒక్క‌ ఏడాదిలోనే ఇది నాలుగో ఘ‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థి శుక్రవారం చెన్నైలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని హాస్టల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరిస్తే ఈ ఏడాది మద్రాస్ ఐఐటీలో ఆత్మహత్య జరగడం ఇది నాలుగోసారి అవుతుంది. ఐఐటీ మద్రాస్ ఒక ప్రకటనలో మరణాన్ని ధృవీకరించింది. అయితే, దీనికి గ‌ల కార‌ణాల‌ను వెల్ల‌డించ‌లేదు.

అంత‌కుముందు, ఏప్రిల్ 1న ఐఐటీ మద్రాస్ లో పీహెచ్ డీ చదువుతున్న 32 ఏళ్ల విద్యార్థి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పశ్చిమ బెంగాల్ కు చెందినవారు. మార్చిలో ఇదే క్యాంపస్ లో మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇత‌ను ఆంధ్రప్రదేశ్ కు చెందిన‌వాడు. అలాగే, ఫిబ్రవరిలో మహారాష్ట్రకు చెందిన ఓ రీసెర్చ్ స్కాలర్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

"కెమికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి 2023 ఏప్రిల్ 21 మధ్యాహ్నం హాస్టల్ గదిలో అకాల మరణం చెందడం మాకు చాలా బాధ కలిగించింది. ఇన్స్టిట్యూట్ తన స్వంత విద్యార్థిని కోల్పోయింది.. వృత్తిపరమైన సమాజం ఒక మంచి విద్యార్థిని కోల్పోయింది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందించాం" అని ఐఐటీ మద్రాస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇన్ స్టిట్యూట్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ.. "మరణించిన విద్యార్థి స్నేహితులు, కుటుంబ సభ్యుల దుఃఖంలో పాలు పంచుకుంటుంది. ఈ క్లిష్ట సమయంలో విద్యార్థి కుటుంబ గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఇన్స్టిట్యూట్ కోరుతోంది. ఒత్తిడిలో ఉన్న విద్యార్థులను గుర్తించి ఆదుకునేందుకు ఐఐటీ మద్రాస్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలను మరింత బలోపేతం చేస్తూనే ఉంటుంది" అని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్