ఉగ్రవాదం వల్ల బీజేపీ నాయకులెవరూ ప్రాణాలు కోల్పోలేదు.. కర్ణాటక సీఎం సిద్దరామయ్య

Published : May 21, 2023, 05:03 PM ISTUpdated : May 21, 2023, 05:05 PM IST
ఉగ్రవాదం వల్ల బీజేపీ నాయకులెవరూ ప్రాణాలు కోల్పోలేదు.. కర్ణాటక సీఎం సిద్దరామయ్య

సారాంశం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు  చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సిద్దరామయ్య.. ఆ పార్టీ నేతలు ఎవరూ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోలేదని వ్యాఖ్యానించారు.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు  చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సిద్దరామయ్య.. ఆ పార్టీ నేతలు ఎవరూ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలైన  దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉగ్రదాడుల్లో మరణించారని అన్నారు. బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ పుణ్య స్మరణ (వర్థంతి) కార్యక్రమంలో సిద్దరామయ్య, ఇతర పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే కాంగ్రెస్ లక్ష్యమని సిద్ధరామయ్య అన్నారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ మొదటి నుంచి యుద్ధం చేస్తోందన్నారు. దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేశారని చెప్పారు. నెహ్రూ వల్లనే భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమైందని.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసిందని  పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిజాయితీగా పని చేయాలని నెహ్రూ ఎప్పుడూ చెప్పేవారని అన్నారు. ప్రస్తుత ప్రధానికి అసలు నెహ్రుతో పోలికే లేదన్నారు. దేశ సమగ్రతను కాపాడటంలో కాంగ్రెస్‌ ముందుందని అన్నారు. రాజీవ్ గాంధీ అధికారాన్ని వికేంద్రీకరించారని  చెప్పారు. 

కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదానికి మద్దతు నిలిచిందని ఆరోపణలు చేస్తుంటారని.. కానీ వాస్తవంగా కాంగ్రెస్‌ అగ్ర నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 

హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని మాజీ సీఎం బసవరాజు బొమ్మై చేసిన ప్రకటనపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. వచ్చే కేబినెట్ భేటీలోగా అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ‘‘బొమ్మై.. మా హామీలన్నీ ప్రజలకు చేరతాయి. ముందు మాట నిలబెట్టుకున్నాం. భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తాం. ఇదే కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉన్న తేడా. కేంద్రంలో, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి సాధించలేదు’’ అని అన్నారు. 

ఇదిలా ఉంటే.. ట్విట్టర్ వేదికగా కూడా బీజేపీపై సిద్దరామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘విద్వేష రాజకీయాలను అంతం చేయడమే రాజీవ్ గాంధీకి మనం ఇచ్చే నిజమైన నివాళి. బీజేపీ ఉన్నంత కాలం సమాజంలో శాంతి, సామరస్యాలు ఉండవు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పేదలు, దళితులు, వెనుకబడిన ప్రజలు ఆందోళనతో జీవిస్తున్నారు. ప్రపంచంలో, దేశంలో శాంతి ఉంటేనే మానవజాతి రక్షించబడుతుంది’’ అని పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్