రేపటికల్లా కర్ణాటక సీఎంపై నిర్ణయం.. అప్పటి వరకు ఫేక్ న్యూస్ నమ్మొద్దు: కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా

Published : May 17, 2023, 04:56 PM IST
రేపటికల్లా కర్ణాటక సీఎంపై నిర్ణయం.. అప్పటి వరకు ఫేక్ న్యూస్ నమ్మొద్దు: కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా

సారాంశం

కర్ణాటక సీఎం ఎవరనేది రేపటిలోగా తేలిపోతుందని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో కర్ణాటక క్యాబినెట్ కూడా కూర్పు జరుగుతుందని వివరించారు. అప్పటి వరకు ఎలాంటి వదంతులను నమ్మరాదని, ఏ నిర్ణయం తీసుకున్నా తామే స్వయంగా, సంతోషంగా వెల్లడిస్తామని చెప్పారు.  

న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం నిర్ణయంపై సస్పెన్స్ నాలుగో రోజు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అనేక కోణాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ, నిజానిజాలేవన్న విషయంపై స్పష్టత లేదు. ఈ తరుణంలో కర్ణాటక ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఇంచార్జీ రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ కర్ణాటక సీఎం నిర్ణయానికి సంబంధించి కొంత స్పష్టత ఇచ్చారు. కర్ణాటక సీఎం ఎవరనేది బుధవారం లేదా గురువారం వెల్లడిస్తామని అన్నారు. రానున్న 48 గంటల నుంచి 72 గంటల్లో రాష్ట్ర క్యాబినెట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

కాబట్టి, అప్పటి వరకు కర్ణాటక సీఎం నిర్ణయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని రణదీప్ సుర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ణాటక సీఎం ఎవరనే నిర్ణయం తీసుకుంటారని, ఆ నిర్ణయం కాగానే తాము సంతోషంగా వెల్లడిస్తామని వివరించారు. కానీ, ఇంతలోపే ఈ నిర్ణయం చుట్టూ అనేక రకాల వదంతులు వస్తున్నాయని, వాటన్ని నమ్మరాదని చెప్పడానికే తాను ముందుకు వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం న్యూస్ చానెల్స్‌లో ఇలాంటి వార్తలు వస్తున్నాయని, వాటిని విశ్వసించరాదని చెప్పారు. ఢిల్లీలోని 10 రాజాజి మార్గ్‌లోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసం ఎదుట రణదీప్ సుర్జేవాలా విలేకరులతో మాట్లాడారు.

Also Read: పిల్లల్ని కనాలి.. నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి: భర్త కోసం జైలు అధికారులకు భార్య విజ్ఞప్తి

కర్ణాటక సీఎం నిర్ణయంపై మల్లికార్జున్ ఖర్గే సంప్రదింపులు జరుపుతున్నారని, కాంగ్రెస్ నిర్ణయం తీసుకోగామనే తాము వెల్లడిస్తామని సుర్జేవాలా అన్నారు.  కాబట్టి, అప్పటి వరకు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, బీజేపీ కావాలనే కొన్ని తప్పుడు వార్తలు ఇస్తున్నదని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?