ముస్లిం మహిళను బైక్ పై తీసుకెళ్లిన హిందు యువకుడు.. స్థానికులు ఆపి యువకుడిపై దాడి

Published : May 17, 2023, 04:07 PM ISTUpdated : May 17, 2023, 04:09 PM IST
ముస్లిం మహిళను బైక్ పై తీసుకెళ్లిన హిందు యువకుడు.. స్థానికులు ఆపి యువకుడిపై దాడి

సారాంశం

బిహార్‌లో ఓ ముస్లిం యువతిని బైక్ పై తీసుకెళ్లుతున్న యువకుడిని కొందరు అడ్డుకున్నారు. ముస్లిం యువతిని ఇంటికి వెళ్లాలని ఆదేశించారు. ఆ తర్వాత యువకుడిని కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

పాట్నా: బిహార్‌లోని పాట్నాలో ఓ దారుణం జరిగింది. ముస్లిం మహిళను బైక్ పై తీసుకెళ్లుతుండగా కొందరు స్థానికులు వారిని అడ్డుకున్నారు. బైక్ పై నుంచి కిందికి దింపేశారు. ఆ యువతిని వెనక్కి ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ యువకుడిపై దాడి చేశారు. ఆ యువతి, యువకుడు క్లాస్‌మేట్లు.

సాగర్ కుమార్ మిశ్రా అనే యువకుడు తన క్లాస్ మేట్ అయిన ముస్లిం యువతిని తన బైక్ పై ఒక చోటికి తీసుకెళ్లుతున్నాడు. వారు పిర్బహోర్ పోలీసు స్టేషన పరిధిలోని మార్కెట్ ఏరియాలోకి వెళ్లగానే కొందరు వారిని అడ్డుకున్నారు. బైక్ పై నుంచి దింపేశారు. ఆ ముస్లిం యువతిని ఇంటికి వెళ్లాలని పంపించేశారు.  

అప్పుడు ఆ యువకుడిని చుట్టు చేరి కొట్టారు. హిందు యువకుడు అయినప్పటికీ ఒక ముస్లిం యువతి చుట్టూ తిరుగు తున్నావనే కారణంగా దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: పిల్లల్ని కనాలి.. నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి: భర్త కోసం జైలు అధికారులకు భార్య విజ్ఞప్తి

ఈ ఘటనను మొత్తం కొందరు వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది.

తమకు ఆ వ్యక్తి వైపు నుంచి లేదా ఆ మహిళ వైపు నుంచి ఎలాంటి ఫిర్యాదు అంద లేదని పాట్నా పోలీసులు తెలిపారు. అయితే, ఆ వైరల్ వీడియో ను ఆధారం చేసుకుని వారు కేసులో దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?