ఢిల్లీ మెట్రోలో వ్యక్తి హస్తప్రయోగం.. ఫొటో రిలీజ్ చేసిన పోలీసులు..

Published : May 17, 2023, 03:28 PM IST
ఢిల్లీ మెట్రోలో వ్యక్తి హస్తప్రయోగం.. ఫొటో రిలీజ్ చేసిన పోలీసులు..

సారాంశం

ఢిల్లీ మెట్రోలో హస్తప్రయోగం చేసిన వ్యక్తి ఫొటోను పోలీసులు రిలీజ్ చేశారు. ఆచూకీ తెలిస్తే చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిపిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామన్నారు. 

ఢిల్లీ : మెట్రో కోచ్‌లో హస్తప్రయోగం చేస్తున్న వ్యక్తి ఫోటోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటన గత నెలలో జరిగిందని.. ఆ వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రజల సహాయాన్ని కోరారు. సదరు మెట్రో ప్రయాణికుడీ గురించి వివరాలు ఇచ్చే వ్యక్తి గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుందని మెట్రో డీసీపీ మంగళవారం పోస్ట్ చేసిన ట్వీట్‌లో తెలిపారు. ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చీఫ్ స్వాతి మలివాల్ ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేయడంతో వ్యక్తిపై కేసు నమోదైంది.

"ఈ వ్యక్తి ఢిల్లీ మెట్రోలో అసభ్యకర చర్యకు పాల్పడుతున్నాడు. ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఇతని గురించి తెలిస్తే దయచేసి ఎహెచ్ఓ ఐజీఐఏ మెట్రోకు 8750871326 నెంలో లేదా 1511 (కంట్రోల్ రూమ్) లేదా 112 (పోలీస్ హెల్ప్‌లైన్)కు తెలియజేయండి. ఇన్ఫార్మర్ గుర్తింపు గోప్యంగా ఉంచుతాం’’ అని మెట్రో డీసీపీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

గాల్లో ఉండగా ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులు.. ఏడుగురు ప్రయాణికులకు గాయాలు..

వేరే ప్రయాణీకుడు రికార్డ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో, ఆ వ్యక్తి తన ఫోన్‌లో ఏదో చూస్తూ ఢిల్లీ మెట్రోలో హస్తప్రయోగం చేస్తున్నాడు. అది గమనించిన అతని సమీపంలో ఉన్న ఇతర ప్రయాణికులు చాలా అసౌకర్యంగా ఫీలవ్వడం, దూరంగా వెళ్లడం కనిపిస్తుంది.

దీంతో ఈ కేసును పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. దీనికి సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 (అశ్లీల చర్యలు, పాటలు) కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను "అనారోగ్యకరమైన చర్య"గా పేర్కొంటూ, డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"ఢిల్లీ మెట్రోలో సిగ్గులేకుండా హస్తప్రయోగం చేసుకుంటున్న వ్యక్తి వైరల్ వీడియోలో కనిపిస్తున్నాడు. ఇది చాలా అసహ్యంగా, బాధాకరంగా ఉంది. నిందితులను అరెస్టు చేసి, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఆమె అన్నారు.

"ఢిల్లీ మెట్రోలో ఇలాంటి కేసులు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వ్యక్తులపై మరోసారి ఎవ్వరూ ఇలా చేయకుండాఉండేలా చర్యలు తీసుకోవాలి, తద్వారా మెట్రోలో మహిళల భద్రతకు భరోసా ఉంటుంది" అని మలివాల్ అన్నారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మెట్రోలో ఫ్లయింగ్ స్క్వాడ్‌ల మోహరింపును ముమ్మరం చేసింది.

 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?