Karnatala Election:' వారు ఆ అంశాన్ని ముట్టుకోలేరు': డికె శివకుమార్ హామీపై సిఎం బొమ్మై ఆగ్రహం 

Published : Apr 07, 2023, 08:45 PM IST
Karnatala Election:' వారు ఆ అంశాన్ని ముట్టుకోలేరు': డికె శివకుమార్ హామీపై సిఎం బొమ్మై ఆగ్రహం 

సారాంశం

Karnatala Election: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముస్లిం రిజర్వేషన్ గురించి హామీ ఇచ్చారు. ఆ ప్రకటనపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఘాటుగా స్పందించారు.

Karnatala Election: అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్ణాటక ప్రభుత్వం రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ముస్లింలకు(మతపరమైన మైనార్టీలు) కల్పిస్తున్న 4 % రిజర్వేషన్లను రద్దు చేసింది. అదే సమయంలో ఆర్థిక వెనుకబడిన వర్గం క్యాటగిరీలోకి చేర్చింది. వొక్కలిగలు, లింగాయత్‌ లకు 2% చొప్పున రిజర్వేషన్‌ కల్పించింది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నిర్ణయం కీలకంగా మారనున్నది. కాంగ్రెస్ ఇదే  ఎజెండాతో ఎన్నికల్లో ముందడుగు వేయనున్నది. ఇప్పటికే ఈ నిర్ణయంపై అధికార, ప్రతిపక్షమధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి.  

తాజాగా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకవచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ముస్లింల 4 శాతం రిజర్వేషన్ కోటాను పునరుద్ధరిస్తామని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు.  డీకే శివకుమార్ శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీ కోటాపై బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తుందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రిజర్వేషన్ అంశాన్ని రద్దు చేసి మైనార్టీల ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చారు. 

సీఎం బసవరాజ్ బొమ్మై కౌంటర్ 

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రకటనపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. దాన్ని (రిజర్వేషన్‌ అంశం) కాంగ్రెస్‌ పార్టీ ముట్టుకోదని అన్నారు. డీకే శివకుమార్‌ చేసిన ఈ ప్రకటనపై సీఎం బసవరాజ్‌ బొమ్మై మాట్లాడుతూ.. ‘వాళ్లు (కాంగ్రెస్‌) దాన్ని తాకలేరు. వాళ్లు ఏం చేస్తారో చూద్దాం.’’అన్నారు. గత నెలలో కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వీరశైవ-లింగాయత్, వొక్కలిగ అనే రెండు ప్రధాన వర్గాలుగా విభజించింది. అదే సమయంలో, ముస్లింలను 10 శాతం EWS (ఆర్థికంగా బలహీనమైన విభాగం) కేటగిరీకి బదిలీ చేయాలని నిర్ణయించారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరంతరం దాడి చేస్తోంది.

ఇదిలా ఉంటే.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈనెల 8న సమావేశమై అభ్యర్థుల జాబితాను ఖరారు, విడుదల చేస్తుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. గెలుపు గుర్రాల ప్రాతిపదికపై అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. మే 10న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు వేయనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?