పద్మ అవార్డు అందుకున్న అత్తగారు సుధా మూర్తిపై యూకే ప్రధాని ఆసక్తికర కామెంట్ ..

By Rajesh Karampoori  |  First Published Apr 7, 2023, 5:53 PM IST

రచయిత్రి , సామాజిక కార్యకర్త సుధా మూర్తి ఇటీవలే ఆమె సామాజిక సేవకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఈ సందర్బంగా ఆమె కూతురు అక్షతా మూర్తి  చేసిన పోస్ట్‌పై ఆమె అల్లుడు యూకే ప్రధాని  రిషి సునక్ ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు.  


ఇటీవల రచయిత్రి , సామాజిక కార్యకర్త సుధా మూర్తికి అరుదైన గౌరవం దక్కింది. ఆమె సామాజిక సేవకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచేతులు మీదుగా పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. ఆమె ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులైన నారాయణ మూర్తిగా శ్రీమతి. ఆమె కుమార్తె అక్షతా మూర్తి. ఆమె అల్లుడు యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌ అన్న విషయం అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా.. సుధామూర్తి సాధించిన ఘనతపై బ్రిటన్ ప్రధాని, అల్లుడు రిషి సునాక్ స్పందించారు.

ఈ సందర్బంగా బ్రిటన్ ప్రథమ మహిళ, సుధామూర్తి  కూతురు అక్షతా మూర్తి .. తన తల్లి సుధామూర్తి పద్మభూషణ్ అందుకున్న ఫోటోను తన Instagramలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇలా రాశారు. " నా తల్లి సామాజిక సేవకు అత్యున్నత గుర్తింపు లభించింది. భారత రాష్ట్రపతి నుండి పద్మభూషణ్ అవార్డును అందుకున్నప్పుడు తాను చాలా గర్వంగా ఫీలయ్యాను. అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించడం, ప్రకృతి వైపరీత్యాల తర్వాత దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి తక్షణ ఉపశమనం , సహాయం అందించడం వంటి అనేక మార్గాల్లోనా తల్లి ప్రజలకు మద్దతునిచ్చింది. నా తల్లి గుర్తింపు కోసం బతకలేదు. నా తల్లితండ్రులు నా సోదరుడిలో, నాలో నాటిన విలువలు,వినయం, నిస్వార్థత ఎల్లప్పుడూ తనతో ఉంటాయి. తన తల్లి అవార్డు అందుకున్న సందర్భం చాలా కదిలించింది" అని పేర్కొన్నారు.  బ్రిటన్ ప్రథమ మహిళ ( అక్షతా మూర్తి )తన తల్లి అద్భుతమైన ప్రయాణాన్ని పేర్కొంది.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Latest Videos

undefined

A post shared by Akshata Murty (@akshatamurty_official)

ఇదిలా ఉండగా.. సుధామూర్తి సాధించిన ఘనతపై బ్రిటన్ ప్రధాని, అల్లుడు రిషి సునాక్ స్పందించారు. అక్షతా మూర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ పై యూకే ప్రధాని రిషి సునాక్ స్పందిస్తూ.. ఇది “గర్వించదగిన రోజు” అని అన్నారు.  సుధా మూర్తి భర్త , ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, కుమారుడు రోహన్ మూర్తి మరియు ఆమె సోదరి డాక్టర్ సునంద కులకర్ణి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రఖ్యాత రచయిత్రి సుధా మూర్తి డిసెంబర్ 2021 వరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరించారు.  

click me!