మంత్రి రాసలీలల కేసు... యువతి ప్రత్యక్షం.. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం

By telugu news teamFirst Published Mar 31, 2021, 8:05 AM IST
Highlights

మరోవైపు తనకు పోలీసుల విచారణపై నమ్మకం లేదంటూ సదరు యువతి సీడీలో పేర్కొనడం గమనార్హం. కాగా.. నిర్భయ కేసులో కీలక అస్త్రం సీఆర్పీసీ 164 సెక్షన్ ను వినియోగించుకొని ఆ యువతి కోర్టుకు హాజరైంది.

కర్ణాటక మాజీ మంత్రి రాసలీలల కేసు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యహారం తాజాగా కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న యువతి ఎట్టకేలకు బయటకు వచ్చింది.  నాలుగు వారాలుగా మొత్తం ఐదు వీడియోలు పంపిన యువతి చివరకు బెంగళూరు చేరింది. మాజీ మంత్రి రమేష్ జార్ఖిహోళి ఎన్ని ఫిర్యాదులు చేసినా.. తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టి కిడ్నాప్ చేశారంటూ డీకే దండెత్తినా.. ఆ యువతి వాంగ్మూలంతోనే ఈ కేసుకు ముగింపు లభిస్తుందని న్యాయ, పోలీసు విభాగాల అధికారులు చెబుతూ వచ్చారు.

మరోవైపు తనకు పోలీసుల విచారణపై నమ్మకం లేదంటూ సదరు యువతి సీడీలో పేర్కొనడం గమనార్హం. కాగా.. నిర్భయ కేసులో కీలక అస్త్రం సీఆర్పీసీ 164 సెక్షన్ ను వినియోగించుకొని ఆ యువతి కోర్టుకు హాజరైంది.

ఎనిమిది మంది సీనియర్ పోలీసు అధికారుల నేతృత్వంలో ఏర్పాటైన దర్యాప్తు బృందం సారధిగా పోలీసు అధికారి సౌమేందు ముఖర్జీ నేతృత్వం వహించి సీడీ కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు హోం మంత్రి బసవరాజు బొమ్మై దిశా నిర్దేశాలతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది.

రెండు వారాల కిందటి నుంచి గోవా, ఢిల్లీ, హైదరాబాద్ లో సీడీ ముఠా కోసం వెతుకులాడుతున్నట్లు హోం మంత్రి చెబుతూ వచ్చారు. యువతి ఎక్కడ ఉందో చెబితే అక్కడికే మహిళా పోలీసులను పంపి వాంగ్మూలం తీసుకుంటామని విపక్షాల ఆరోపణలకు సమాధానమిచ్చారు. భద్రత కల్పించాలంటూ మరోవైపు యువతి కమిషనర్ కార్యాలయాన్ని కోరింది.

ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసే వీడియోలపై అధికారులు నిఘా ఉంచారు.  అయినా కూడా యువతి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మంగళవారం తనకు కోర్టు నుంచి అనుమతి దక్కిందని తెలిసిన వెంటనే దర్జాగా కోర్టుకు హాజరై వాంగ్మూలం వినిపించింది. ఆపై ఎన్ఐటీ అధికారుల వద్ద 161వ సెక్షన్ కింద వాంగ్మూలాన్ని ఇచ్చి దర్జాగా వెల్లిపోయింది. పోలీసుల సూచన మేరకు బుధవారం వూద్య పరీక్షలకు కూడా హాజరౌతానని చెప్పింది. రాష్ట్ర నేర  చరిత్రలో నేరుగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన కేసు ఇదే కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. సీడీ కేసులో బాధిత యువతి ఇచ్చిన వాంగ్మూలం ఏమై ఉంటుందో తెలియని కారణంగా ఈ కేసులో రమేష్ జార్ఖిహోళి వేచి చూడక తప్పదు. ఇప్పటికే యువతి వాంగ్మూలం ఇచ్చి ఉండటంతో నిందితుడిని వెంటనే బంధించాలని ఆమె తరపు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. తాను తప్పు చేయలేదు అందుకే ముందస్తు మెయిల్ కూడా దరఖాస్తు చేయలని రమేష్ పేర్కొనడం గమనార్హం.

కాగా.. సదరు యువతికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడం గమనార్హం. కాంగ్రెస్ యువ నాయకులంతా ఆమెకు మద్దతుగా బెంగళూరులో నిలిచారు.  భారీ సంఖ్యలో కోర్టుకు వారంతా తరలి వచ్చారు. 

click me!