అవినీతి కేసులో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప అరెస్టు

By Mahesh KFirst Published Mar 27, 2023, 8:27 PM IST
Highlights

అవినీతి కేసులో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరుపాక్షప్ప అరెస్టు అయ్యారు. ఆయన బెయిల్ రద్దు కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు సంబంధించిన అవినీతి కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
 

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరుపాక్షప్ప అవినీతి కేసులో అరెస్టు అయ్యారు. ఆయన బెయిల్ రద్దు అయిన తర్వాత ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌కు సంబంధించి ఓ అవినీతి కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన కొడుకు ప్రశాంత్ మదల్ సుమారు రూ. 40 లక్షల కోట్ల లంచం తీసుకుంటూ గత నెల రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఆ లంచం కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కు రా మెటీరియల్ సప్లై చేసే టెండర్ పొందడానికి ఈ లంచం ఇచ్చినట్టు లోకాయుక్తా పోలీసులు తెలిపారు. ఈ అవినీతి కేసును లోకాయుక్తా పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు.

ప్రశాంత్ మదల్‌ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తర్వాత పోలీసులు వారి ఇంటిలో తనిఖీలు చేశారు. ఈ రైడ్‌లో లెక్కకు రాని రూ. 8 కోట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం సుపారీలు అమ్మడం ద్వారా వచ్చాయని చిన్నగిరి ఎమ్మెల్యే మదల్ విరుపాక్షప్ప వాదిస్తున్నారు.

Also Read: ధర్మపురి సోదరుల మధ్య రచ్చకెక్కిన విభేదాలు.. డీఎస్ రాజీనామా వెనక మతలబేంటి?

ఈ అవినీతి కేసు బయటకు రాగానే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌ చైర్మన్ పోస్టు నుంచి వైదొలిగారు.

ఈ నెలలో ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ లభించగానే దేవాంగిరిలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అయితే, ఈ బెయిల్‌ను అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

click me!