రాజ్యసభ ఎన్నికలు : కర్ణాటకలో షాకిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ... కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు

By Siva Kodati  |  First Published Feb 27, 2024, 9:41 PM IST

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా వున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు గాను ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కర్ణాటక ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు బీజేపీ చీఫ్ విప్ దొడ్డనగౌడ జి పాటిల్ తెలిపారు. 


దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా వున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు గాను ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి భారీగా క్రాస్ ఓటింగ్ జరుగుతూ వుండటంతో అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు బీజేపీ చీఫ్ విప్ దొడ్డనగౌడ జి పాటిల్ తెలిపారు. దీనికి సీఎం సిద్ధరామయ్య కౌంటరిచ్చారు. తమ పార్టీలో క్రాస్ ఓటింగ్ సాధ్యం కాదన్నారు. తారు తమ (బీజేపీ) ఎమ్మెల్యేలను అలాగే ఉంచనివ్వండి.. క్రాస్ ఓటింగ్ బీజేపీలో మాత్రమే సాధ్యమవుతుందని విమర్శించారు. 

పార్లమెంట్ ఎగువ సభకు సంబంధించి కర్ణాటకలోని నాలుగు స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. అయితే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేపై పార్టీ చర్యలు తీసుకుంటుందని దొడ్డనగౌడ స్పష్టం చేశారు. ఎస్టీ సోమశేఖఱ్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగా నిర్థారణ అయ్యిందని, ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఓటు వేసే ముందు ఎస్టీ సోమశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో నీరు, ఇతరత్రా నిర్వహణలకు నిధులు ఇస్తానని భరోసా ఇచ్చే వారికి అనుకూలంగా ఓటు వేస్తానని తెలిపారు. 

Latest Videos

సోమశేఖర్ నిర్ణయంతో బీజేపీ ధైర్యంగా ముందుకొచ్చింది. ఆ పార్టీకి చెందిన బసనగౌడ ఆర్ పాటిల్ (యత్నాల్) ఇలా అన్నారు. కొన్నిసార్లు అలాంటివి జరుగుతూనే వుంటాయని, బీజేపీ జేడీ అభ్యర్ధులకు ఓటు వేయాలని పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని పాటిల్ తెలిపారు. ఈ వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దినేష్ గుండూరావు స్పందించారు. తామంతా చెక్కు చెదరకుండా వున్నామని.. బీజేపీ గెలుపు కోసం ఎలాంటి పద్ధతినైనా అనుసరిస్తుందని ఆరోపించారు. 

కాగా.. కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న ఐదు రాజ్యసభ స్థానాలకు గాను కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ .. బీజేపీ నుంచి నారాయణషా బాండేజ్ , కుపేంద్ర రెడ్డి (జేడీఎస్)లు పోటీలో వున్నారు. కర్ణాటకలో ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ ఎంపీల రాజ్యసభ పదవీకాలం ముగిసింది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా. 

224 ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో ఒక్కో రాజ్యసభ అభ్యర్ధి గెలవాలంటే కనీసం 45 ఓట్లు అవసరం. 135 ఎమ్మెల్యేల బలంతో అజయ్ మాకెన్, నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్‌లను గెలిపించుకోవడానికి కాంగ్రెస్‌కు ఖచ్చితమైన బలం వుంది. బీజేపీకి 66 మంది ఎమ్మెల్యేల బలం వుండటంతో.. ఆ పార్టీ అభ్యర్ధి నారాయణ షా భాండాగే గెలుపు లాంఛనమే. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లో చాలా మంది సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగా సమాచారం. 

click me!