తమిళనాడు : మోడీపై అభిమానం చాటుకున్న కొంగు రీజియన్.. ప్రధానికి అపురూప కానుకలు

By Siva KodatiFirst Published Feb 27, 2024, 7:39 PM IST
Highlights

మంగళవారం తమిళనాడులోని పల్లడంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆయనకు ప్రజలు బ్రహ్మారథం పట్టారు. వేదికపైకి వచ్చిన ప్రధాని కొంగు ప్రాంత వాసులు చూపిన అభిమానంతో పులకించిపోయారు. ఈరోడ్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి 67 కిలోల పసుపు మాల (గార్లాండ్)ను బహుమతిగా ఇచ్చారు. 

మంగళవారం తమిళనాడులోని పల్లడంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆయనకు ప్రజలు బ్రహ్మారథం పట్టారు. వేదికపైకి వచ్చిన ప్రధాని కొంగు ప్రాంత వాసులు చూపిన అభిమానంతో పులకించిపోయారు. ఈ ప్రాంతంలో పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు ఈరోడ్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి 67 కిలోల పసుపు మాల (గార్లాండ్)ను బహుమతిగా ఇచ్చారు. సహజసిద్ధంగా ఈరోడ్ ప్రాంతం పసుపు సాగుకు ప్రసిద్ధి. పసుపు బోర్డు ఏర్పాటుకు ఎన్‌డీయే ప్రాంతం తీసుకున్న నిర్ణయం ఎగుమతులను పెంచుతుందని అక్కడి రైతులు భావిస్తున్నారు. 

మహిళా ఎస్‌హెచ్‌జీలకు ప్రధాని మోడీ ప్రాధాన్యతను ఇస్తున్నందున కృతజ్ఞతలు తెలిపేందుకు నీలగిరికి చెందిన తోడా గిరిజన సంఘం చేతితో తయారు చేసిన శాలువాను ప్రధాన మంత్రికి అందజేశారు. దీని కారణంగా శాలువా విక్రయాలు గణనీయంగా పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. డీఎంకే కూడా భాగస్వామిగా వున్న యూపీఏ హయాంలో కాంగ్రెస్ జల్లికట్లును నిషేధించిన తర్వాత తిరిగి తీసుకురావడానికి ధన్యవాదాలు తెలుపుతూ జల్లికట్టు ఎద్దు ప్రతిరూపాన్ని ప్రధాని మోడీకి బహూకరించారు. 

 

 

అంతకుముందు కాంగ్రెస్, వామపక్షాలను ఉద్దేశించి.. ‘‘కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ లు శత్రువులు, కానీ బయట బెస్ట్ ఫ్రెండ్స్’’ అని వ్యాఖ్యానించారు. తిరువనంతపురంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వయనాడ్ నుంచి యువరాజును గద్దె దింపాలని వామపక్షాలు కోరుకుంటున్నాయని అన్నారు. ‘‘ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు హింసకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. కేరళలో ఒకరికొకరు శత్రువులు అయితే కేరళ వెలుపల మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి కూర్చొని తినే స్నేహితులు’’ అని ప్రధాని తెలిపారు. 

కాంగ్రెస్ యువరాజును వయనాడ్ నుంచి తరిమికొట్టాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి. కేరళకు దూరంగా ఉండాలని యువరాజుకు వీరు సలహా ఇస్తున్నారు’’ అని రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్, దాని ఇతర కమ్యూనిస్టు కూటమిలకు ఒకే ప్రాధాన్యత ఉంది. తమ కుటుంబాన్ని మాత్రమే దేశాన్ని పాలించడానికి వారు అనుమతించారు. వారికి భారతీయుల సంక్షేమం కంటే వారి కుటుంబ సంక్షేమమే గొప్పది’’ అని అన్నారు.

 

కేరళలోని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ లో రెండవ అతిపెద్ద సంకీర్ణ భాగస్వామి అయిన సీపీఐ లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత అనీ రాజాను బరిలోకి దింపింది. కాగా.. రాహుల్ గాంధీ లెఫ్ట్ అభ్యర్థితో పోటీ చేయకుండా బీజేపీకి అభ్యర్థిపై పోటీ చేయాలని సీపీఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు.
 

click me!