పండగ వేళ తీవ్ర విషాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఏడుగురు మృతి

Published : Jan 14, 2022, 11:13 AM ISTUpdated : Jan 14, 2022, 11:17 AM IST
పండగ వేళ తీవ్ర విషాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఏడుగురు మృతి

సారాంశం

సంక్రాంతి పండగ వేళ కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దావణగెరె జిల్లా (Davangere district ) జగలూరు తాలూకాలో (Jagalur taluk) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. 

సంక్రాంతి పండగ వేళ కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దావణగెరె జిల్లా (Davangere district ) జగలూరు తాలూకాలో (Jagalur taluk) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. కననకట్టే గ్రామం వద్ద  NH-50పై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.

కారులో ప్రయాణిస్తున్నవారిని యాద్గిర్ జిల్లా షాహ్‌పూర్‌కు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో అందరూ పురుషులే. వీరు Bengaluru నుంచి హోస్‌పేటకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జగులూరు రూరల్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దావణగెరె ఎస్పీ సీబీ రిష్యంత్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఇదిలా ఉంటే  ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్‎తో వెళ్తున్నలారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయపడినవారికి తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo