పశ్చిమబెంగాల్ లో రైలు ప్రమాద స్థలిని సందర్శించిన రైల్వే మంత్రి.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య (వీడియో)

Published : Jan 14, 2022, 10:37 AM IST
పశ్చిమబెంగాల్ లో రైలు ప్రమాద స్థలిని సందర్శించిన రైల్వే మంత్రి.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య (వీడియో)

సారాంశం

తెల్లవారుజామున 3 గంటలకు S 10 స్లీపర్ కోచ్ నుండి ఒక మృతదేహాన్ని వెలికి తీశామని రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. రైల్వే మంత్రి Ashwini Baisnav ఈ రోజు ప్రమాదస్థలిని పరిశీలిస్తారని తెలిపారు. ఆయన ప్రస్తుతం ప్రమాదస్థలిలో ఉన్నారు.  ప్రమాదంలో 42 మంది గాయపడ్డారు 3 ఆసుపత్రులలో చేరారు, 5 నుంచి 6 మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. 

పశ్చిమబెంగాల్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికి మొత్తం 9 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో Rescue Work పూర్తయ్యిందని  NF రైల్వే జనరల్ మేనేజర్, Angshul Gupta మీడియాతో అన్నారు. రెస్క్యూ వర్క్ పూర్తయింది, ఇప్పుడు రైల్వే ట్రాక్‌ను క్లియర్ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోయారు.

"

తెల్లవారుజామున 3 గంటలకు S 10 స్లీపర్ కోచ్ నుండి ఒక మృతదేహాన్ని వెలికి తీశామని తెలిపారు. రైల్వే మంత్రి Ashwini Baisnav ఈ రోజు ప్రమాదస్థలిని పరిశీలిస్తారని తెలిపారు. ఈ ప్రమాదంలో 42 మంది గాయపడ్డారు 3 ఆసుపత్రులలో చేరారు, 5 నుంచి 6 మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. 

పశ్చిమ బెంగాల్ లో నిన్న జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.  పట్టాలు తప్పిన కోచ్‌లలో ఎక్కువ మంది ప్రయాణికులు చిక్కుకోలేదని అధికారులు తెలిపారు. క్షతగాత్రులైన 36 మందిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు జల్‌పైగురి, మేనాగురిలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బికనీర్ నుండి గౌహతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రాణాలతో బయటపడిన వారందరినీ అర్ధరాత్రి కోచ్‌ల నుండి బయటకు తీసుకువచ్చినట్లు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గునీత్ కౌర్ కి తెలిపారు. కోచ్‌లను ఇప్పుడు పునరుద్ధరణ కోసం తెరిచామని ఆమె తెలిపారు.

గురువారం బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా మేనాగురి పట్టణం సమీపంలో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు పన్నెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. "ప్రమాదం జరిగిన ప్రదేశం వైపు వెళుతున్నాను" అని అతను గత రాత్రి ట్వీట్ చేశాడు.

ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి సహాయక చర్యల గురించి తెలియజేసినట్లు మంత్రి చెప్పారు. ‘బాధితులను ఆదుకోవడానికి అన్నిరకాలుగా శ్రమిస్తున్నాం’ అని తెలిపారు. 

ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రైలు పట్టాలు తప్పడానికి దారితీసిన కారణాలపై విచారణకు ఉన్నత స్థాయి భద్రతా విచారణకు ఆదేశించారు. రైల్వే మంత్రి కూడా ప్రయాణికులకు నష్టపరిహారం ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష, స్వల్ప గాయాలకు రూ. 25,000 అందజేస్తామని మంత్రి నిన్న ప్రకటించారు.

సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం నుండి వచ్చిన దృశ్యాలలో, కోచ్ లు ఒకదాని కొకటి ఢీకొనడంతో ఒకదానిమీదికి మరొకటి ఎక్కినట్లు, అనేక బోగీలు బోల్తా పడినట్లుగా ఉంది. 
రెస్క్యూ ఆపరేషన్స్‌లోకి మూడు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. స్థానికులతో సహా తోటి ప్రయాణికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?