మీ పేలవమైన పనితీరును కవర్ చేయడానికే నిరాధారమైన వాదన.. డేటా ఇదిగో: రాహుల్‌ ఆరోపణలకు కంచన్ గుప్తా కౌంటర్

Published : Mar 07, 2023, 01:41 PM IST
మీ పేలవమైన పనితీరును కవర్ చేయడానికే నిరాధారమైన వాదన.. డేటా ఇదిగో: రాహుల్‌ ఆరోపణలకు కంచన్ గుప్తా కౌంటర్

సారాంశం

భారతదేశంలో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా తీవ్రంగా స్పందించారు. భారత పార్లమెంటులో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ నిరాధారమైనదని పేర్కొన్నారు.  

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బ్రిటన్ పర్యటనలో చేస్తున్న కామెంట్స్ వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఆయన చేసే వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లండన్‌లోని హౌస్ ఆఫ్ పార్లమెంట్ కాంప్లెక్స్‌లో బ్రిటిష్ ఎంపీలతో రాహుల్ మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తోందని విమర్శించారు. ‘‘పార్లమెంట్‌లో మా మైక్‌లు అవుట్ ఆఫ్ ఆర్డర్‌లో లేవు. అవి పని చేస్తున్నాయి.. కానీ వాటిని ఆన్ చేయలేం. నేను మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు చాలాసార్లు జరిగింది’’ అని రాహుల్ గాంధీ అన్నారు. 

అయితే రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత పార్లమెంటులో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ నిరాధారమైనదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా అన్నారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ హాజరు, తదితర వివరాలకు సంబంధించిన గణంకాలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. రాహుల్ గాంధీ ఎంపీగా ఆయన పేలవమైన పనితీరును ప్రొసీడింగ్‌లలో తక్కువ భాగస్వామ్యాన్ని కవర్ చేస్తుందుకే ఇటువంటి నిరాధారమైన వాదన చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌లో వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరు.. కేరళ ఎంపీల సగటు హాజరు కంటే తక్కువ అని.. జాతీయ సగటు కంటే చాలా తక్కువ అని పేర్కొన్నాడు. 

 

పార్లమెంట్ రాహుల్ గాంధీ జీరో అటెండెన్స్ స్కోర్ చేసినప్పుడు కూడా భారత పార్లమెంటు మొత్తం సమావేశాలు జరిగాయని తెలిపారు. 2020లో పార్లమెంట్ వర్షకాల సమావేశాలలో రాహుల్ గాంధీ హాజరు 0 శాతం అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్‌ను కూడా జతచేశారు. సగటున భారత పార్లమెంటు సభ్యులు 68 చర్చల్లో పాల్గొన్నారని..  రాహుల్ గాంధీ స్కోర్ దయనీయంగా 6 గా మాత్రమే ఉందని చెప్పారు. 

భారత పార్లమెంటులో 2019 నుంచి 2023 మధ్య రాహుల్ గాంధీ 92 ప్రశ్నలు అడిగారని.. ఇందుకు సంబంధించి కేరళ ఎంపీల సగటు 216గా, జాతీయ సగటు 163గా ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ జీరో ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారని.. ఇందుకు సంబంధించి కేరళ సగటు 3.7గా జాతీయ సగటు 1.2గా ఉందని తెలిపారు. తాను పేర్కొన్న డేటా పబ్లిక్‌గా అందుబాటులో ఉందని చెప్పారు.

రాహుల్ గాంధీ చెప్పిన అబద్ధాల డేటా.. ‘‘భారత పార్లమెంటులో ప్రతిపక్షం నిశ్శబ్దం చేయబడింది. సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలకు అనుమతి లేదు. ప్రతిపక్షాలు ప్రశ్నలు అడగలేవు’’ ఇలా ఉందని విమర్శించారు. రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత్ పరువు తీయడం ఆపాలని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ తప్పిదస్థుడైన స్కూల్‌బాయ్‌లా ఉంటాడు.. హోమ్‌వర్క్ ఎక్కడ ఉంది అని ఉపాధ్యాయుడు అతడిని అడిగినప్పుడు.. కుక్క నా హోమ్‌వర్క్‌ను తిన్నది అని అబద్ధం చెబుతాడు’’ అని సెటైర్లు వేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !