
కాళీ పోస్టర్ పై నెలకొన్న వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీ మొదటి సారిగా పరోక్షంగా స్పందించారు. కాళీ దేవి కేవలం బెంగాల్‌కే కాకుండా యావత్ భారతదేశానికి భక్తికి కేంద్రమని అన్నారు. అయితే ఆయన ఎవరి పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. స్వామి వివేకానంద కూడా కాళీకి అమితమైన విశ్వాసి అని ఆయన అన్నారు. ‘‘కాళీ మాత అపారమైన ఆశీర్వాదాలు భారతదేశానికి ఉన్నాయి. ఆధ్యాత్మిక శక్తి పరంగా భారతదేశం ముందుకు సాగుతోంది. ప్రపంచ కళ్యాణ స్ఫూర్తితో భారతదేశం ముందుకు సాగుతోంది. దేవీ శక్తి మనకు మార్గదర్శి’’ అని అన్నారు.
శ్రీలంకకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.. ప్రస్తుతం శరణార్థుల సంక్షోభం లేదు - జై శంకర్
రామకృష్ణ మఠానికి 15వ అధ్యక్షుడిగా పనిచేసిన స్వామి ఆత్మస్థానానంద శత జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. రామకృష్ణ పరమహంసను స్మరించుకుంటూ.. ‘‘ స్వామి రామకృష్ణ పరమహంస తన కళ్లతో కాళీ మాతను చూసిన గొప్ప సాధువు ’’ అని అన్నారు. అనంతరం బెంగాల్ కాళీ పూజ, స్వామి వివేకానంద ను కూడా మోడీ ప్రస్తావించారు. ‘‘ స్వామి వివేకానంద గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన కాళీ మాత పట్ల భక్తితో చిన్నపిల్లలా మారాడు. అలాంటి అచంచలమైన విశ్వాసం స్వామి ఆత్మస్థానానందలో కూడా ఉంది ’’ అని అన్నారు.
జైలు నుంచే నేరాలు.. 81 మంది జైలు అధికారులకు లంచాలు
“నేటి కార్యక్రమం నాకు వ్యక్తిగతంగా కూడా అనేక భావాలు, జ్ఞాపకాలతో నిండి ఉంది. స్వామి ఆత్మస్థానంద్ జీ తన శతాబ్దపు జీవితానికి చాలా దగ్గరగా తన శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి. చివరి క్షణం వరకు ఆయనతో టచ్ లో ఉండడం నా అదృష్టం.’’ అని అన్నారు.‘‘ స్వామీజీ మహారాజ్ చేతన రూపంలో ఈ రోజు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని నేను భావించాను. ఆయన జీవితాన్ని, లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఫొటో హిస్టరీ, డాక్యుమెంటరీ అనే రెండు స్మారక సంచికలు కూడా ఈరోజు విడుదలవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.’’ అని మోడీ చెప్పారు.
ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత, కాళీ వివాదంపై టీఎంసీ చీఫ్, మమతా బెనర్జీ, ఆ పార్టీ ఎంపీ మహువా మోయిత్రాలను బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా టార్గెట్ చేశారు. భారతదేశం మొత్తానికి దేవత గురించి ప్రధాని మోదీ చాలా భక్తిపూర్వకంగా మాట్లాడుతుంటే, మమతా బెనర్జీ తన పార్టీ ఎంపీలు దేవత అభ్యంతరకరమైన చిత్రణను సమర్థించారని మాలవీయ ట్వీట్ చేశారు.
కర్ణాటకలో రెండు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ ‘చింతన్ శివిర్’.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ
కెనడాకు చెందిన తమిళ చిత్రనిర్మాత లీనా మణిమేకలై తన డాక్యుమెంటరీ పోస్టర్‌ను విడుదల చేయడంతో ఈ నెల ప్రారంభంలో కాళీపై వివాదం మొదలైంది, ఆ పోస్టర్ లో కాళీ దేవత వేషంలో ఉన్న మహిళ సిగరేట్ తాగుతోంది. దీంతో వివాదం నెలకొంది. ఈ పోస్టర్ ను టీఎంసీ ఎంపీ మొయిత్రా సమర్థించారు. దీంతో ఆమెపై, అలాగే మణిమేకలై పలు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.