
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడమే తప్ప, పార్టీకి ఎటువంటి సిద్ధాంతం లేదని ఆరోపించారు. పరువు నష్టం కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీకి "ప్రత్యేకమైన చికిత్స" అందించారని బిజెపి లీడర్ సింధియా విమర్శించారు. పార్టీ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తోందని, ఈ మేరకు ఆ పార్టీ సాధ్యమైనదంతా చేస్తుందని ఆరోపించారు .
విలేకరుల సమావేశంలో జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ..రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తమ వ్యక్తిగత పోరాటాన్ని ప్రజాస్వామ్య పోరాటంగా మార్చుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, రాహుల్ రాజకీయంగా తమని తాము నిలబెట్టుకోవడానికి వీలున్నదంతా చేస్తున్నారని విమర్శించారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది.ఆ తర్వాత ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటోంది.
'కోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం'
కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దేశంలో ఒక వాతావరణం ఏర్పడుతోంది... నగరాల్లో రైళ్లను నిలిపివేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేనా గాంధీయిజం ? ఒక వ్యక్తికి ఇంతలా చేయాలా? అసలు దేశంలో ఏం జరుగుతోంది? అని నిలాదీశారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ప్రత్యేక ఆతిథ్యం ఇస్తోంది. బెయిల్ కోసం వెళ్లేసరికి నేతల సైన్యాన్ని మొత్తం తీసుకెళ్లారు. ఇది కోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కాకపోతే, మరి ఏమిటి? అని ప్రశ్నించారు.
'కాంగ్రెస్‌కు సిద్ధాంతం లేదు'
ఈ పార్టీ వెనుకబడిన వారిని అవమానించిందని, భద్రతా బలగాల నుండి వారి ధైర్యానికి రుజువు కావాలని సింధియా అన్నారు. పార్లమెంటు సభ్యుడు అనర్హత వేటు పడటం ఇదే మొదటిసారి కాదు. కానీ, రాహుల్ గాంధీ విషయంలో మాత్రం ఎప్పుడూ చూడని విధంగా దుమారం రేగడం సిగ్గుచేటు.
కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని సింధియా అన్నారు. వారికి మిగిలింది ఒకే ఒక భావజాలం.. అది దేశద్రోహి సిద్ధాంతం.. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే సిద్ధాంతమని అని ఏద్దేవా చేశారు. ఇక సింధియా మాట్లాడుతూ.. 'రాహుల్ గాంధీ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. నేను గాంధీని అని అంటున్నాడు. ఎవరికీ క్షమాపణ చెప్పడని, తన ప్రకటన సిగ్గుచేటని అన్నారు.