ఏటీఎం ముట్టుకోకుండా డబ్బులు డ్రా.. ఇక సాధ్యమే

By telugu news teamFirst Published Jun 9, 2020, 11:13 AM IST
Highlights

కరోనా వైరస్ ని దృష్టిలో పెట్టుకొని  వివిధ బ్యాంకులు కాంటాక్ట్‌లెస్ ఏటీఎం మెషీన్లను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తున్నాయి. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం ఏటీఎం టెక్నాలజీపై పనిచేసే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కొత్తగా ఒక మెషీన్‌ను అభివృద్ధి చేసింది.

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా.. వైరస్ విజృంభిస్తోంది. ఎటునుంచి ఈ వైరస్ ఎటాక్ చేస్తుందో అర్థంకాక ప్రజలు భయపడిపోతున్నారు. ఎంత ఇంట్లోనే ఉందామని అనుకున్నా.. చిన్న చిన్న అవసరాలకైనా వెళ్లాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా డబ్బులు డ్రా చేసుకోవడం తప్పనిసరి.

ఈ క్రమంలో.. ఏటీఎంని తాకినా.. డబ్బులు తాకినా వైరస్ ప్రబులుతుందంటూ వార్తలు వచ్చాయి. దీంతో.. ప్రజలు మరింత భయపడిపోతున్నారు. అయితే.. ఏటీఎంనిన ముట్టుకోకుండానే డబ్బులు తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు.

కరోనా వైరస్ ని దృష్టిలో పెట్టుకొని  వివిధ బ్యాంకులు కాంటాక్ట్‌లెస్ ఏటీఎం మెషీన్లను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తున్నాయి. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం ఏటీఎం టెక్నాలజీపై పనిచేసే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కొత్తగా ఒక మెషీన్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో మొబైల్ ఫోన్ ఆధారంగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవ‌చ్చు. 

ఈ నూత‌న విధానం వ‌ల‌న కార్డ్ క్లోనింగ్ అవుతుంద‌న్న భ‌యం కూడా ఉండ‌దు. దీనితోపాటు కాంటాక్ట్‌లెస్ ఏటీఎంల సాయంతో డబ్బులను కేవలం 25 సెకన్లలోనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం వినియోగ‌దారులు ఏటిఎం స్క్రీన్‌లో చూపించిన‌ క్యూఆర్‌ను స్కాన్ చేయాల్సివుంటుంది. క్యూఆర్ కోడ్ ఫీచర్ ఉప‌యోగించి న‌గ‌దు ఉపసంహరించుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుందని, ఇది చాలా సురక్షితమ‌ని ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కంపెనీ తెలిపింది. 

click me!