
న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ బుధవారంనాడు ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము డీవై చంద్రచూడ్ తో సీజేఐగా ప్రమాణం చేయించారు.50వ, భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా చంద్రచూడ్ ప్రమాణం చేశారు. 2024 నవంబర్ 10 వతేదీవరకు చంద్రచూడ్ సీజేఐగా కొనసాగనున్నారు.
రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.చంద్రచూడ్ తండ్రి కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేశారు.భారత సుప్రీంకోర్టు16వ చీఫ్ జస్టిస్ గా వైవీ చంద్రచూడ్ పనిచేశారు.1978 ఫిబ్రవరి 2నుండి 1985జూలై 11 వ తేదీ వరకు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా కొనసాగారు.
also read:నేడు సుప్రీంకోర్టు సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఏమిటీ ఆయన నేపథ్యం.. ?
1959 నవంబర్ 11న చంద్రచూడ్ జన్మించారు.ఢిల్లీ యూనివర్శిటీ నుండి ఆయన లా పట్టా పొందారు.హార్వర్ఢ్ యూనివర్శిటీ నుండి ఆయన రెండు అడ్వాన్స్‌డ్ లా డిగ్రీలు పొందారు.39 ఏళ్లకే ముంబై హైకోర్టులో సీనియర్ లాయర్ గా ఆయన పలు కేసులను వాదించారు.2000 మార్చి 29న ముంబై హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.2013 అక్టోబర్ 13 వ తేదీ నుండి 2016 మే 13 వరకు ఆయన అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు.2016 మే13 నుండి సుప్రీంకోర్టు జస్టిస్ గా పనిచేస్తున్నారు.డీవై చంద్రచూడ్ పలు కీలకమైన కేసుల తీర్పులను వెల్లడించారు.ట్రిపుల్ తలాక్,పద్మనాభస్వామిఆలయం,గోప్యతహక్కుఆధార్ చట్టబద్దత వంటి పలు కీలక కేసుల్లో ఆయన తీర్పులను వెలువరించారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ సోమవారంనాడు రిటైరయ్యారు.ఆయనకు సోమవారంనాడు ఘనంగా వీడ్కోలు పలికారు.ఇవాళ చంద్రచూడ్ సీజేఐగా ప్రమాణం చేశారు.
జస్టిస్ యుయు లలిత్ తన తదుపరి సీజేఐగా చంద్రచూడ్ పేరును సిఫారసు చేశారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఎన్వీ రమణ ఈ ఏడాది ఆగస్టులో రిటైరయ్యారు. తన తదుపరి లలిత్ పేరును ఎన్వీ రమణ సిఫారసు చేసిన విషయం తెలిసిందే.