న్యూడిల్లీలో హైటెక్ వ్యభిచారం... వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలతో సహా రేట్ కార్డు

Arun Kumar P   | Asianet News
Published : Nov 09, 2021, 10:04 AM IST
న్యూడిల్లీలో హైటెక్ వ్యభిచారం... వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలతో సహా రేట్ కార్డు

సారాంశం

వ్యభిచార కార్యకలాపాలను ప్రోత్సహించేలా జస్ట్ డయల్ వ్యవహరిస్తోందంటూ డిల్లీ మహిళా కమీషన్ ఆ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా డిల్లీ పోలీసులను ఆదేశించింది. 

న్యూడిల్లి: దేశ  రాజధాని న్యూడిల్లిలో స్పాల మాటున సాగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టయింది. ఈ వ్యభిచారాన్ని ప్రోత్సహించేలా వ్యవహరించిందని ఆరోపిస్తూ జస్ట్ డయల్ కు డిల్లీ మహిళా కమీషన్ సమన్లు జారీచేసింది.  just dial పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ డిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు మహిళా కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.  

ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. న్యూడిల్లీలో  spa ల మాటున వ్యభిచార దందా సాగుతున్న ఆ రాష్ట్ర మహిళా కమీషన్ కు ఫిర్యాదులు అందాయి. just dial ను ఉపయోగించుకుని వ్యభిచార ముఠాలు తమ దందా సాగిస్తున్నట్లు కొందరు ఫిర్యాదు చేసారు. దీంతో జస్ట్ డయల్ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు women commission ఓ బృందాన్ని ఏర్పాటుచేసింది.  

మహిళా కమీషన్ బృందం దర్యాప్తులో భాగంగా just dial ద్వారా నగరంలోని స్పాల వివరాలను కోరింది. అడిగిన వెంటనే ఈ బృందానికి 15కాల్స్, 32 వాట్సాప్ మెసేజ్ లు వచ్చాయి. యువతుల ఫోటోలతో పాటు వారి సేవల రేట్ కార్డును కూడా పంపించారు.  

కొన్ని స్పాల నుండి మహిళా కమీషన్ బృందానికి అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చాయి. అందమైన అమ్మాయిల ఫోటోలను పంపించి వ్యభిచారానికి సంబంధించిన వివరాలను అందించారు. దీంతో స్పాల మాటున వ్యభిచారం సాగుతున్నట్లు... ఈ గలీజ్ దందాను ప్రోత్సహించేలా just dial వ్యవహరిస్తోందని మహిళా కమీషన్ బృందం నిర్దారణకు వచ్చింది. 

read more  సొంత చెల్లిని వ్యభిచారంలోకి దింపిన అక్క.. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో..

దీంతో  జస్ట్ డయల్ అధికారులను స్పా ల విషయంలో అనుసరిస్తున్న చర్యలను వివరించాలని మహిళా కమీషన్ కోరింది. స్పా లో అందించే సేవల వివరాలు కోరిన కమిషన్ బృందానికి అసభ్య సందేశాలు, అమ్మాయిల ఫోటోలను పంపిన స్పాల వివరాలను ఈ బృందం కోరింది. అలాగే జస్ట్ డయల్ సైట్‌లో జాబితా చేసేందుకు సదరు స్పా ల నుండి తీసుకున్న డబ్బుల వివరాలను అందించాలని కూడా కమిషన్ కోరింది. పూర్తి  వివరాలతో కూడిన నివేదికను నవంబరు 12వ తేదీలోగా ఇవ్వాలని కమిషన్ జస్ట్ డయల్ ను ఆదేశించింది.

ఇక జస్ట్ డయల్ వ్యవహారం, హైటెక్ వ్యభిచారంపై డిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. ''న్యూడిల్లీలో సాగుతున్న వ్యభిచార రాకెట్ లో జస్ట్ డయల్ పాత్రపై విచారించడానికి ఆ సైట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసాం. వెంటనే జస్ట్ డయల్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశించాం'' అని ఆమె తెలిపారు.

read more  హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇద్దరు మహిళలు

 ఇదిలావుంటే ఎంతో పవితమైన పూజారి వృత్తిలో వుండి ఈజీ మనీ కోసం గలీజ్ దందా ప్రారంభించాడు. కట్టుకున్న భార్యతో కలిసి ఏకంగా ఓ వ్యభిచార గృహాన్నే నిర్వహిస్తున్న సదరు పూజారిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసారు.   

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో రమేష్ చారి పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే ఇలా పూజలు చేసి పవిత్రమైన సంపాదనను కాదని గలీజ్ దందాలోకి దిగాడు. నల్గొండ పట్టణ శివారులోని దేవరకొండ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని brothel house ని నిర్వహిస్తున్నాడు. కట్టుకున్న భార్యతో కలిసే రమేష్ చారి వ్యభిచార దందా ప్రారంభించాడు. 

నిరుపేద యువతులు, మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వారిని వ్యభిచార కూపంలోకి లాగుతున్నాడు. ఇలా ఓ డిగ్రీ విద్యార్థినితో పాటు మరికొందరు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. వివిధ మార్గాల్లో విటులను ఆకర్షించి వారినుండి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. వ్యభిచార గృహానికి సంబంధించి వ్యవహారాలన్ని రమేష్ చారి భార్య చూసుకునేది. ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసారు. 

 

PREV
click me!

Recommended Stories

CPI-CPM Joint Press Conference: విజయ్ కు వామపక్షాల మద్దతుసీఎం కుర్చీ ఎక్కనున్న తలపతి| Asianet Telugu
Thalapathy Vijay CM: విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం.. స్వీట్లు పంచి సంబరాల్లో ఫ్యాన్స్| Asianet Telugu