కర్ణాటకలో విషాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

By narsimha lodeFirst Published Nov 9, 2021, 9:29 AM IST
Highlights


కేసు పెడతారనే భయంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లాలో చోటు చేసుకొంది.


బెంగుళూరు: Karnataka రాష్ట్రంలోని Kolarలో విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కోలారు పట్టణంలోని గల్‌పేట పరిధిలోని కారంజికట్టలో నివాసం ఉంటున్నారు. గత నెల 18వ తేదీన హోన్నెహళ్లి గ్రామానికి చెందిన మహిళ చిన్నారి కిడ్నాప్ నకు గురైంది.  ఈ బాలిక సత్య, సుమిత్ర దంపతుల ఆడ శిశువు. మునియప్ప కుటుంబానికి చెందిన మహిళ ఈ చిన్నారిని తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి.

 దీంతో ఈ విషయమై మునియప్ప కుటుంబాన్ని పోలీసులు ప్రశ్నించారు.  పోలీసులు కేసు పెడతారని భయంతో మునియప్ప, ఆయన భార్య నారాయణమ్మ, కొడుకు బాబు, మనమరాలు గంగోత్రి  పురుగుల మందు తాటి ఆత్మహత్యాయత్నం చేశారు. 

పాప కిడ్నాప్ జరిగిందా లేదా పాపను ఆ దంపతులే  ఇచ్చారా అనే విషయమై కూడా స్పష్టత లేదు..ఈ తరుణంలో మునియప్ప కుటుంబాన్ని పోలీసులు విచారణ నిర్వహించారు. అయితే పోలీసులు ఆ కుటుంబాన్ని విచారించారు. అయితే ఈ పాప గురించి సమాచారం తమకు తెలియదని  బాధిత కుటుంబం పోలీసులకు చెప్పారని మృతుల బంధువులు చెబుతున్నారు. 

also read:బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడి.. యువకుడికి 20 యేళ్ల జైలు శిక్ష..

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ   మరణించారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా నేరం ఒప్పుకోకపోతే పోలీసులు కేసు నమోదు చేస్తారనే భయంతో ఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులు తెలిపారు.అయితే ఈ విషయమై పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేస్తారనే భయంతో ఆదివారం  నాడు మునియప్ప కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఐడుగురు మరణించారని మృతుల బంధువులు తెలిపారు.

అసలు పసిబిడ్డను విక్రయించారా .. ఇచ్చారా

సత్య, సుమిత్ర దంపతుల చిన్నారిని విక్రయించారనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ బిడ్డను తిరిగి ఇవ్వాలని సత్య దంపతులు కోరారనే ప్రచారం కూడ ఉంది. అయితే చిన్నారిని తీసుకొన్న మహిళ బిడ్డను తిరిగి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో వివాదం చెలరేగిందనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ విషయమై మునియప్ప కుటుంబాన్ని పోలీసులు ప్రశ్నించారు. దీంతో కేస భయంతో మునియప్ప కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో వాస్తవాలు  బయటపెట్టాలని మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

చిన్నారుల విక్రయం లేదా దత్తత పేరుతో దేశంలోని పలు రాష్ట్రాల్లో అనేక ఘటనలు చోటు చేసుకొన్నాయి. గతంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆడపిల్ల పుట్టిందనే కారణంగా చిన్నారులను దత్తత పేరుతో విక్రయించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గిరిజన తండాల్లో ఆడపిల్లల విక్రయం గతంలో పెద్ద సంచలనం చోటు చేసుకొంది. దత్తత పేరుతో చిన్నారుల విక్రయం చోటు చేసుకొంది.దీంతో అప్పటి ఏపీ సర్కార్ దేవరకొండ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీని అమలు చేసింది. 


 

click me!