జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత: విద్యార్ధులను అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు

By Siva KodatiFirst Published Jan 9, 2020, 7:14 PM IST
Highlights

ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో గురువారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్‌యూ వీసీని తొలగించాలంటూ విద్యార్ధులు రాష్ట్రపతి భవన్‌ వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. 

ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో గురువారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్‌యూ వీసీని తొలగించాలంటూ విద్యార్ధులు రాష్ట్రపతి భవన్‌ వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రిభవన్‌ వద్ద పోలీసులు, విద్యార్ధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Also Read:జెఎన్ యూ వివాదం: కారణం తెలుగు వ్యక్తే, ఆయనెవరంటే....

కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేఎన్‌యూ ఘటనపై విచారణకు వైస్ ఛాన్సలర్ ఎం.జగదీశ్ కుమార్ ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఐదుగురు ప్రొఫెసర్లు సుశాంత్ మిశ్రా, మజహర్ ఆసిఫ్, సుధీర్ ప్రతాప్ సింగ్, సంతోష్ శుక్లా, భస్వతీ దాస్ సభ్యులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి జేఎన్‌యూ రిజిస్ట్రార్ డా. ప్రమోద్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read:జెఎన్ యులో దీపిక పడుకొనే: దాడికి గురైన విద్యార్థులకు మద్దతు

జనవరి 5 ఆదివారం సాయంత్రం జేఎన్‌యూలోకి ముసుగులతో ప్రవేశించిన సుమారు 50 మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, ఇనుపరాడ్లతో విద్యార్ధులు, అధ్యాపకులపై దాడికి పాల్పడి పాల్పడ్డారు. ఈ ఘటనలో విద్యార్ధి సంఘం నేత అయిషే ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. 

click me!