
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో శనివారం సాయంత్రం సమావేశయ్యారు. ఈ సమావేశంలో రాబోయే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లపై చర్చించారు. అయితే కాంగ్రెస్ చీఫ్‌ను కలిసిన అంశం, అందులో మాట్లాడుకున్న విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని మీడియాతో తెలిపారు.
‘‘ సోనియాగాంధీని కలిసి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఆమెకు నేను చెప్పాను. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, ఆ విషయంలో మేము చర్చించాము. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం ’’ అని మీడియా సంస్థ ANI తో హేమంత్ సోరెన్ అన్నారు. కాగా గురువారం జార్ఖండ్ కాంగ్రెస్ సమావేశం దేశ రాజధానిలో జరిగింది. ఇందులో స్థానిక నాయకుడిని రాజ్యసభకు పంపలా లేదా అనే అంశాన్ని నిర్ణయించారు.
రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశం ఎప్పటికీ పురోగమించదు - ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే, జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ మరియు రాష్ట్రానికి చెందిన అర డజనుకు పైగా పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంపై చర్చలు కూడా జరిగాయి. జార్ఖండ్ కాంగ్రెస్ నేతలు స్థానిక నేతను రాజ్యసభకు పంపాలని కోరుతున్నారని ఠాకూర్ అన్నారు.
తమిళనాడులో ద్రవిడియన్ మోడల్ ట్రైనింగ్ క్యాంపులు.. జాతి వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి..!
కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, బీజేపీ ఎంపి మహేష్ పొద్దార్ పదవీకాలం జూలై 7తో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ నుండి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడి నుంచి తమ తమ అభ్యర్థిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ - జార్ఖండ్ ముక్తి మోర్చా - రాష్ట్రీయ జనతాదళ్ కూటమి నుంచి రాజ్యసభ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. .కాగా రాష్ట్ర అసెంబ్లీలో జేఎంఎంకు 30 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జార్ఖండ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
15 రాష్ట్రాల సభ్యుల పదవీ విరమణ కారణంగా ఖాళీ అయిన 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. సభ్యులు జూన్ 21, ఆగస్టు 1వ తేదీ మధ్య వేర్వేరు తేదీల్లో సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో పదకొండు సీట్లు ఖాళీ కానుండగా, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఆరుగురు సభ్యుల చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. ఐదుగురు రాజ్యసభ ఎంపీలు బీహార్‌లో పదవీ విరమణ చేయనుండగా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి నలుగురు సభ్యులు బయటకు రానున్నారు. వీటితో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, ఛత్తీస్గఢ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ నుంచి ఇద్దరు చొప్పున, ఉత్తరాఖండ్ నుంచి ఒకరు రిటైర్ అయినప్పుడు సీట్లు ఖాళీ అవుతాయి.