జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 ఫలితాల విడుదల: సత్తా చాటిన తెలుగు విద్యార్ధులు

By narsimha lodeFirst Published Oct 15, 2021, 12:20 PM IST
Highlights

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ ఖరగ్ పూర్ శుక్రవారం నాడు విడుదల చేసింది.
దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా కేంద్రాల్లో విద్యార్ధులకు ఈ ర్యాంకుల ఆధారంగా ఆడ్మిషన్ దక్కనుంది.ఈ ఫలితాల్లో మృదుల్ అగర్వాల్ కు ఫస్ట్ ర్యాంకు దక్కింది. 

న్యూఢిల్లీ: JEE Advanced  పరీక్షా ఫలితాలు శుక్రవారం నాడు విడుదలయ్యాయి. IIT Kharagpur  ఫలితాలను విడుదల చేసింది. దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా కేంద్రాల్లో విద్యార్ధులకు ఈ ర్యాంకుల ఆధారంగా ఆడ్మిషన్ దక్కనుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు 1,51,193 మంది విద్యార్ధులు ధరఖాస్తు చేసుకొన్నారు.అయితే ఇందులో 1,41,699 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.ఈ ఫలితాల్లో 41,862 మంది అర్హత సాధించారు. వీరిలో 35,410 మంది బాలురు, 6452 మంది  బాలికలున్నారు.ఇవాళ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు తమ సత్తా చాటారు.  గుంటూరు జిల్లాకు చెందిన రుషికేష్ రెడ్డికి పదో ర్యాంకులో నిలిచాడు. విజయవాడకు చెందిన దివాకర్ సాయికి 11వ ర్యాంకు దక్కింది.

దేశ వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తమకు నచ్చిన కాలేజీాలో ఆడ్మిషన్ల కొరకు ర్యాంకుల ఆధారంగా విద్యార్ధులు ధరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి నుండి రిజిస్ట్రేషన్లు  చేసుకోవచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ తెలిపింది.ఈ నెల 27న తొలి రౌండ్ సీట్ల కేటాయింపు జరగనుంది. నవంబర్ 1న రెండో రౌండ్ సీట్లను కేటాయించనున్నారు. 

also read:https://telugu.asianetnews.com/national/jee-main-result-2021-44-candidates-score-100-percentile-18-share-top-rank-qzgfzj

ఈ ఫలితాల్లో మృదుల్ అగర్వాల్ కు ఫస్ట్ ర్యాంకు దక్కింది. బాలికల విభాగంలో కావ్య చోప్రా ఫస్ట్ ర్యాంకు సాధించింది.జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో రామస్వామి సంతోష్ రెడ్డి, ఎస్పీ కేటగిరిలో నందిగామ నిఖిల్ ఫస్ట్ ర్యాంక్ లో నిలిచారు. ఐఐటీ అడ్వాన్స్‌డ్  పరీక్షల్లో 100 లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్ధులకు మంచి కాలేజీల్లో ఆడ్మిషన్ దక్కనుంది.100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు ఐఐటీ ఖరగ్‌పూర్ లో 2021-22 విద్యా సంవత్సరం నుండి ట్యూషన్ ఫీజుతో పాటు,హస్టల్ రుసుం కూడ చెల్లించాల్సిన అవసరం లేదని వీసీ  ప్రకటించారు.


 

click me!