
దశాబ్దనర్న కాలంగా ఎదురుచూస్తున్న భారతదేశ నిరీక్షణకు తెరపడింది. జాబిలిపై అడుగమోపాలనే ఇస్రో కల కోరిక నేరవేరింది. భారత అంతరిక్ష్య సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్-3’ మిషన్ విజయవంతమైంది. ఈ మిషన్ లోని ల్యాండర్, రోవర్లలు చంద్రుడి దక్షిణ ధ్రువంపై బుధవారం సాయంత్రం 6:04గంటలకు విజయవంతంగా సాప్ట్ ల్యాండింగ్ అయ్యాయి.
దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ విజయంతో జాబిలిపై అడుగుపెట్టిన నాల్గో దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు జాబిల్లిపై అడుగుడినా దక్షిణ ధ్రువం వైపు తొలి సారిగా కాలుమోపిన దేశం భారత్ కీర్తి గడించింది. మొత్తానికి మన చంద్రయాన్ -3 చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ అపూర్వ విజయం వెనుకున్న ఇస్రో, దాని సైంటిస్టులను యావత్ భారతావనే.. కాకుండా ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సక్సెస్ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి చాలా ప్రత్యేకమనే చెప్పాలనీ, చంద్రయాన్-3 ప్రయోగ బృందంలో జామియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు మాజీ విద్యార్థులు (అరీబ్, అమిత్, కాషిఫ్) భాగస్వామ్యం కావడం విశేషం. ఈ విజయంతో ఈ విద్యార్థులు హీరోలుగా మారారు.. ఇతరులకు స్ఫూర్తిదాయకమయ్యారు.
ఈ ముగ్గురు విద్యార్థులు (అరీబ్, అమిత్ , కాషిఫ్) ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (2019 బ్యాచ్) పూర్వ విద్యార్థులు. ISRO సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించిన వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ తరువాత జూలై 2021లో నిర్వహించిన ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఇస్రోకు సెలక్టయ్యారు. వారి ఊహించని విధంగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3లో భాగస్వామ్యమయ్యారు. ఓ సారి వారి మనోగతం ఏంటో.. ఆ యూనివర్సీటీ విద్యార్థులు విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారో మీ కోసం..
అరీబ్, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి. "ఈ విజయం మా కుటుంబానికి మాత్రమే కాదు.. యావత్తు దేశానికి సంతోషకరమైన క్షణం. నిజానికి అరీబ్ చాలా భిన్నమైన పిల్లవాడు. అతను తన చదువులో చాలా చురుకు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అతడు తోబుట్టువుల కంటే చాలా భిన్నంగా ఉంటాడు. ఈ విజయంలో మా అబ్బాయి కూడా భాగస్వామ్యం కావడంతో చాలా గర్వంగా ఫీలవుతున్నాను." అని అరీబ్ కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్బంగా జామియా వీసీ నజ్మా అక్తర్ మాట్లాడుతూ.. “ ఈ మిషన్ విజయం మాకు పండుగ (ఈద్) లాంటిది. చంద్రయాన్-3 విజయం నిజంగా ఓ జాతీయ వేడుక. ఈ మిషన్ విజయం కావాలని ల్యాండింగ్‌కు ముందు.. సక్సెస్ తరువాత యూనివర్సిటీలో ఉమ్మడి ప్రార్థనను నిర్వహించాం.. అని పేర్కొన్నారు.
మొహమ్మద్ ఉవైష్ రాజ్‌పుత్
జామియా యూనివర్సీటి పూర్వ విద్యార్థి మొహమ్మద్ ఉవైష్ రాజ్‌పుత్. ఇతడు ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ విద్యార్థి. ఉవైష్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. “జామియా (JMI) విద్యార్థిగా చంద్రయాన్ -3 విజయం నాలో స్ఫూర్తిని నింపింది. ఈ విజయం నాకే కాదు.. ప్రతి భారతీయ విద్యార్థిలో జాతీయ భావాన్ని నింపుతుంది. మా కలలను సహకారం చేసుకోవడానికి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణించటానికి ఈ విజయం నిజంగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది." అని తెలిపారు.
ఆన్ ఆఫ్రీన్ మాజీ JMI విద్యార్థి మాట్లాడుతూ.. “తెలియని వాటిని అన్వేషించాలనే చంద్రయాన్-3 మిషన్ సంకల్పం నాకు నిజంగా స్ఫూర్తినిచ్చింది. అంతరిక్ష పరిశోధన భవిష్యత్తుపై ఆశ ,ఉత్సుకతను పెంపొందిస్తూ.. ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి మానవాళి స్ఫూర్తినిస్తుంది. " అని తెలిపారు.
ఇదే సమయంలో JMI ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థి హుమాయున్ రషీద్ మాట్లాడుతూ.. “చంద్రయాన్ బృందంలో మా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారని తెలుసుకున్నప్పుడు.. మేము సంతోషిస్తున్నాము. వారి విజయం నిశ్చయించుకున్న ముస్లిం విద్యార్థులకు అవకాశం లభిస్తుందని, వారు గొప్ప పనులు కూడా చేయగలరని నిరూపించారు. " అని పేర్కొన్నారు.