శ్రీలక్ష్మి కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ.. నేడు విచారణ..

Published : Aug 25, 2023, 08:53 AM IST
శ్రీలక్ష్మి కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ.. నేడు విచారణ..

సారాంశం

ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

ఢిల్లీ : ఓబులాపురం మైనింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై ఓబులాపురం మైనింగ్ కేసులో ఉన్న అభియోగాలు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనినే సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 

ప్రియురాలిని దారుణంగా హ‌త్య‌చేసిన ప్రియుడు.. ఏం జరిగిందంటే..?

ఆ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. అనంతపురం జిల్లాలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 2007లో అక్రమంగా గనులు కేటాయించారని శ్రీ లక్ష్మీపై సిబిఐ కేసులు నమోదు చేసింది. సిబిఐ కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.  ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును శ్రీలక్ష్మి ఆశ్రయించారు.

ఆమె పిటీషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ గతేడాది నవంబర్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ  తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం నాడు దీనిమీద విచారణ జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu